ePaper
More
    HomeతెలంగాణIT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు షాక్​ ఇచ్చారు. ఆయన ఇంటిపై గురువారం దాడులు చేశారు. మెడికల్, ఇంజినీరింగ్​ సీట్ల విషయంలో అవకతవకలు, విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు(Heavy Fees From Students) వసూలు చేశారన్న ఆరోపణలపై అధికారులు సోదాలు చేశారు. మాజీ మంత్రితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

    IT Raids on Mallareddy | అనుమానాస్పద లావాదేవీలు

    మల్లారెడ్డికి భారీగా ఇంజినీరింగ్​ కాలేజీలు, మెడికల్​ కాలేజీ, ఆస్పత్రులు ఉన్న విషయం తెలిసిందే. మల్లారెడ్డి హాస్పిటల్స్ (Mallareddy Hospitals), సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ(Mallareddy Medical College)లో ఆర్థిక లావాదేవీలను ఇటీవల ఇన్​కం ట్యాక్స్​ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో తాజాగా సోదాలు నిర్వహించడం గమనార్హం. కాలేజీలు, ఆస్పత్రుల్లో అనుమానాస్పదంగా భారీ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ ఛైర్మన్ భద్రారెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు.

    IT Raids on Mallareddy | గతంలో సైతం..

    మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరగడం ఇది తొలిసారి కాదు. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో చాలా సార్లు ఐటీ అధికారులు (IT Officers) ఆయన ఇంటితో పాటు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. 2022లో సైతం ఆయన ఇంట్లో అధికారులు దాడులు చేపట్టారు. 50 బృందాలు అప్పుడు సోదాలు చేశాయి. ఈ సందర్భంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులకు సంబంధించి ఐటీ కట్టడంలో హెచ్చు తగ్గులను అధికారులు గుర్తించడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...