అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CJ Roy Suicide | రివాల్వర్‌తో కాల్చుకుని దిగ్గజ వ్యాపారి సీజే రాయ్ (CJ Roy) సూసైడ్ చేసుకున్నారు. బెంగుళూరులోని రిచ్ మండ్ సర్కిల్ (Richmond Circle) ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్పిడెంట్ గ్రూప్ (Confident Group) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సీజే రాయ్ తుపాకీతో కాల్చుకున్నారు. శుక్రవారం ఆయన గది నుంచి తుపాకీ శబ్ధం వినిపించడంతో సిబ్బంది వెళ్లి చూశారు. అప్పటికే రాయ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సీజే రాయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
CJ Roy Suicide | ఐటీ దాడులతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ మధ్యాహ్నం రిచ్మండ్ రోడ్‌లోని తన కార్యాలయానికి చేరుకున్నాడు. ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండు మూడు రోజులుగా ఆ ప్రాంగణంలో సోదాలు చేస్తున్నారు. కేరళ నుంచి ఒక బృందం వచ్చిందని, అంతకు మించి తమకు వివరాలు తెలియవని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ తెలిపారు. రాయ్ కుటుంబ సభ్యులతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. వారు విదేశాల్లో ఉన్నారని, భారత్‌కు వస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదాయపు పన్ను అధికారులు రాయ్‌ను ఇబ్బంది పెడుతున్నారని, దాడులు మూడు రోజులుగా జరుగుతున్నాయని అతడి సోదరుడు బాబు ఆరోపించారు. కాగా కాన్ఫిడెంట్ గ్రూప్ కేరళ(Kerala), కర్ణాటకతో సహా అనేక దక్షిణ భారత రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్. అయితే కొంతకాలంగా కాన్ఫిడెంట్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఆదాయపు పన్ను వివాదంలో చిక్కుకుంది. కేరళ ఐటీ అధికారులు ఆయన కార్యాలయంలో సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డట్లు బాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడట్లు తెలుస్తోంది.