అక్షరటుడే, డిచ్పల్లి : KCR Deeksha Divas | తెలంగాణ యూనివర్సిటీ ఎదుట కేసీఆర్ దిక్షా దివస్ కార్యక్రమానికి మొదట అనుమతి ఇచ్చి అనంతరం నిరాకరించడం అన్యాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాం యాదవ్ (Senior BRS leader Rajaram Yadav) పేర్కొన్నారు.
ఈ మేరకు వర్సిటీ పరిపాలన భవనం ఎదుట శనివారం నాయకులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షా దివస్ (Deeksha Divas)కు అనుమతి నిరాకరించడంలో కాంగ్రెస్ నాయకుల (Congress Leaders) హస్తం ఉందని ఆరోపించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చుంటే పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారని.. అక్కడి నుంచి ఆయన చేసిన దీక్షతోనే డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిందన్నారు.
ఈ మేరకు రాష్ట్రమంతటా దీక్షా దివస్ నిర్వహిస్తుంటే.. తెయూ ఎదుట కార్యక్రమ నిర్వహణను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. తెయూ గేట్ వద్ద దీక్ష శిబిరం వద్ద టెంట్ కూల్చివేసి..ఫ్లెక్సీని చించివేయడం అమానుషమన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పెద్దలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఒత్తిడితో పోలీసులు తమ శిబిరానికి అనుమతి నిరాకరించారని ఆరోపించారు.
నిరసన కార్యక్రమంలో రాజారాం యాదవ్‌తో విద్యార్థి నాయకులు సంతోష్, నాగేంద్ర, నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు కుమార్, లింగం యాదవ్, బొట్టు శ్రీనివాస్ యాదవ్, రాగుల అశోక్ పటేల్, జక్కుల రాజేందర్ యాదవ్, పసులు రాజు తదితరులు పాల్గొన్నారు.