HomeUncategorizedJustice Varma | త‌ప్పుకోవాల‌న‌డం అన్యాయం.. జ‌స్టిస్ వ‌ర్మ‌

Justice Varma | త‌ప్పుకోవాల‌న‌డం అన్యాయం.. జ‌స్టిస్ వ‌ర్మ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Justice Varma | ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో డ‌బ్బు సంచులు దొరికాయ‌నే వివాదం నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Verma) రాజీనామా చేసేందుకు నిరాక‌రించారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో 11 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత, త‌న జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకోవాలని కోరడం అసమంజసమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న‌ను రాజీనామా చేయాల‌న‌డం, లేదా స్వచ్ఛంద పదవీ విరమణ కోరడం స‌రికాద‌న్నారు. రాజీనామా చేయ‌నందుకు తొలగించాలని సిఫార్సు చేయడం అన్యాయమ‌ని వ‌ర్మ అభివర్ణించారు. విధానపరమైన న్యాయం లేకపోవడంపై జస్టిస్ వర్మ తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారు. అంతర్గత కమిటీ తనకు వ్యక్తిగత విచారణను అందించలేదని లేదా దాని ప్రాథమిక ఫలితాలను పంచుకోలేదని పేర్కొన్నారు.

అలా చేస్తే తాను త‌ప్పు చేసిన‌ట్లుగానే భావించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అకార‌ణంగా త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌న‌డం అన్యాయమ‌ని అలహాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వ‌ర్మ (Allahabad High Court Judge Justice Verma) పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి తాజాగా లేఖ రాశారు. వ‌ర్మ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) న్యాయ‌మూర్తిగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న అధికారిక నివాసంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలో మంట‌లు ఆర్పుతుండ‌గా, ఒక గ‌దిలో ఉంచిన‌ సంచుల్లో నోట్ల క‌ట్ట‌లు స‌గం కాలిపోయి క‌నిపించ‌డం అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. జ‌స్టిస్ వ‌ర్మ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో స్పందించిన అప్ప‌టి సుప్రీంకోర్టు (Supreme Court) ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సంజీవ్ ఖ‌న్నా ఆయ‌న‌ను ఢిల్లీ నుంచి అల‌హాబాద్ హైకోర్టుకు బ‌దిలీ చేశారు. అలాగే, ఈ ఘ‌ట‌న‌పై ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో అంత‌ర్గ‌త క‌మిటీ వేసి విచార‌ణ జ‌రిపించారు. అనేక అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు క‌మిటీ నివేదిక ఇవ్వ‌డంతో ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని సుప్రీం చీఫ్ జ‌స్టిస్ జీవ్ ఖన్నా (Chief Justice Jiv Khanna) మే 6న వర్మ‌కు సూచించారు. 48 గంట‌ల్లో ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని లేక‌పోతే త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

అయితే, సీజేఐ స‌ల‌హాను జ‌స్టిస్ వ‌ర్మ (Justice Varma) తిర‌స్క‌రించారు. అటువంటి సలహా ఇవ్వ‌డం ప్రాథమికంగా అన్యాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో 11 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత, త‌న జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకోవాలని కోరడం అసమంజసమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. విధానపరమైన న్యాయం లేకపోవడంపై జస్టిస్ వర్మ తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారు. అంతర్గత కమిటీ తనకు వ్యక్తిగత విచారణను అందించలేదని లేదా దాని ప్రాథమిక ఫలితాలను పంచుకోలేదని పేర్కొన్నారు.

Must Read
Related News