ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | మిమ్మల్ని ఉరి తీసినా తప్పులేదు.. బీఆర్‌ ఎస్‌ నేతలపై సీఎం...

    CM Revanth Reddy | మిమ్మల్ని ఉరి తీసినా తప్పులేదు.. బీఆర్‌ ఎస్‌ నేతలపై సీఎం రేవంత్‌ ఫైర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రూ.లక్ష కోట్ల ప్రజాధానంతో కాళేశ్వరం పేరిట కూలేశ్వర ప్రాజెక్టు కట్టిన బీఆర్‌ ఎస్‌ నేతలను ఉరి తీసినా తప్పు లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

    తెలంగాణలో ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌ నేతలకు (BRS leaders) సవాల్‌ విసిరారు. పదేళ్లలో పేదలకు ఒక్క రేషన్‌ కార్డు (ration card) ఇవ్వడానికి వారికి మనసు రాలేదని, కానీ ఇప్పుడు 3.30 లక్షల కార్డులు ఇస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లా (Suryapet district) తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సోమవారం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు.

    CM Revanth Reddy | పేదలకు అండగా కాంగ్రెస్..

    కాంగ్రెస్‌ పార్టీ (Congress party) పేదల పక్షపాతి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఘనత తమదేనని చెప్పారు. రేషన్ కార్డు అంటే పేద వారి ఆత్మగౌరవం, గుర్తింపు అని అన్నారు. పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్ కార్డు అని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.

    READ ALSO  ACB Raids | ఏసీబీ దూకుడు.. లంచావ‌తారుల‌కు చుక్క‌లు.. రూ.వంద‌ల కోట్ల అక్ర‌మాలు బ‌య‌ట‌కు..

    పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి.. గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ పంపిణి చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డుల (new ration cards) ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్ కార్డులు అందుకున్నారని వెల్లడించారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వ లేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

    CM Revanth Reddy | రైతుల సంక్షేమం కోసం..

    రైతుల సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress government) పని చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించామన్నారు. రైతుభరోసా కూడా అమలు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, కానీ తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామని వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయన్న రేవంత్‌రెడ్డి.. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

    READ ALSO  BC Reservations | బీసీ కోటా.. వీడ‌ని ఉత్కంఠ‌.. సందిగ్ధంలో కాంగ్రెస్ స‌ర్కారు

    CM Revanth Reddy | 2 లక్షల ఉద్యోగాలిస్తాం..

    కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని సీఎం అన్నారు. మహాలక్ష్మీ పథకంలో (Mahalaxmi scheme) భాగంగా ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 18 నెలల్లోనే రూ.6, 500 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ఇక, ఉద్యోగాల భర్తీని కూడా వేగవంతం చేశామని, ఇప్పటికే 60 వేల మందికి నియామకపత్రాలు అందించామని చెప్పారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు.

    CM Revanth Reddy | కాళేశ్వరమా.. కూలేశ్వరమా?

    బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) మూడేండ్లకే కుంగిపోయిందని ముఖ్యమంత్రి విమర్శించారు. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ (Former CM KCR) కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల ప్రజాధనాన్ని మింగేశారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టును అడ్డు పడింది తామేనని తెలిపారు. కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టుపైన అయినా చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్ విసిరారు.

    READ ALSO  MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    CM Revanth Reddy | జగదీశ్ రెడ్డిపై ఫైర్..

    తుంగతుర్తికి వస్తున్న సీఎంను అడ్డుకుంటామన్న మాజీ మంత్రి జగదీశ్‌ (former minister Jagadish Reddy) రెడ్డిపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మూడు అడుగులున్న స్థానిక నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్లో సోడా పోయడమే నీకు తెలుసని జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్లో సోడా పోసినట్లు కాదని వ్యాఖ్యానించారు. సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్లే కాదు.. పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేతలదని ఎద్దేవా చేశారు.

    Latest articles

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...

    Anganwadi centers | అంగ‌న్‌వాడీ.. అసౌకర్యాల బడి

    అక్ష‌ర‌టుడే, భీమ్‌గ‌ల్‌: Anganwadi centers | అంగన్​వాడీ కేంద్రాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువవడంతో...

    More like this

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...