Homeజిల్లాలునిజామాబాద్​Shabbir Ali | పదవుల కోసం పాకులాడితే కుదరదు: షబ్బీర్

Shabbir Ali | పదవుల కోసం పాకులాడితే కుదరదు: షబ్బీర్

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Shabbir Ali | పదవుల కోసం పాకులాడితే కుదరదని, కష్టపడిన వారికి పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. పీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగర (nizamabad city) కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సిటీ అధ్యక్షుడు కేశ వేణు (kesha venu ) అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) కులగణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. వివాదాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఛైర్మన్ తిరుపతి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​ బిన్ హందాన్​, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.