ePaper
More
    HomeజాతీయంShashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    Shashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలు భారతదేశాన్ని రష్యా, చైనాకు దగ్గరగా నెట్టగలవని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) హెచ్చరించారు. ఇది రాబోయే సంవత్సరాల్లో వాషింగ్టన్​కు పెద్ద విధాన వైఫల్యంగా మారవచ్చని సూచించారు.

    ప్రపంచానికి అత్యంత అవసరమైన భారత్ – అమెరికా బంధాన్ని (India-US relationship) కాపాడుకుకోవాలని, అందుకోసం వెంటనే టారిఫ్​లు తగ్గించాలని ట్రంప్​కు సూచించారు. ఇండియాను దూరం చేసుకుంటే క్వాడ్ కూటమి బలహీనపడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ది ఇండియన్ ఎక్స్​ప్రెస్​ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా రష్యా, చైనాతో (Russia and China) అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా తన దేశంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొనవ్చని తెలిపారు. అమెరికన్ నిపుణులు అప్పుడు దేశాన్ని ఎవరు కోల్పోయారు” అని కోపంగా ఆలోచిస్తారని థరూర్ అన్నారు.

    Shashi Tharoor | సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి..

    వ్యూహాత్మక స్వతంత్ర వైఖరి అనేది భారత సార్వభౌమాధికారమని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలని శశిథరూర్​ సూచించారు. ట్రంప్ తనకు పట్టింపు లేదని నటించినప్పటికీ, భారతదేశం-అమెరికా సంబంధం 21వ శతాబ్దంలో (21st century) అత్యంత ఫలితవంతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలలో ఒకటి అని థరూర్ గుర్తు చేశారు. గత 25 సంవత్సరాలుగా తమ సంబంధాన్ని నిర్వచించిన భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలకు ఇప్పటికే సమాధి తవ్వబడిందని విచారం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంధన ఎంపికలు, రక్షణ కొనుగోళ్ల పేరిట భారత్ ను శిక్షించడం సమంజసం కాదని పేర్కొన్నారు.

    Shashi Tharoor | దౌత్య ప్రయత్నాలు జరగాలి

    ప్రపంచానికి దిశానిర్దేశం చేసే భారత్ – అమెరికా సంబంధాలను విచ్ఛిన్నం చేయడం సరికాదని థరూర్ అభిప్రాయపడ్డారు. సంబంధాలను కాపాడుకోవడానికి ఇంకా ఆలస్యం కాలేదని వాషింగ్టన్​కు నాలుగు సూచనలు చేశారు. ఇండియాపై ముఖ్యంగా ఇప్పటికే 25 శాతం బేస్ లైన్ సుంకం కారణంగా నష్టపోతున్న అన్ని కార్మిక-ఇంటెన్సివ్ రంగాలపై అమెరికా మొదట శిక్షాత్మక సుంకాలను ఎత్తివేయాలని సూచించారు.

    అలాగే భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలను వేగవంతం చేయాలని, పరస్పర రాయితీలను నిర్మాణాత్మకంగా చర్చించడం ద్వారా న్యూ ఢిల్లీకి ఇతర మార్కెట్లపై ఆధారపడడానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నారు. ట్రంప్ మోదీతో (PM Modi) ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని, బహుశా ఆయన పుట్టినరోజున మోదీని పిలవాలన్నారు. చివరగా, భారతదేశంతో సాంకేతికత, రక్షణ సహకారాన్ని అమెరికా మరింతగా పెంచుకోవాలని సూచించారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...