అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | అటవీ సంపదను కాపాడే బాధ్యత అందరిదని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచమ్మ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ (Banswada) ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (SRNK Government Degree College) మంగళవారం వన మహోత్సవంలో (vana Mahotsavam) భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
Mla Pocharam | ప్రకృతిని నాశనం చేయవద్దు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రకృతిని నాశనం చేస్తే భావితరాలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj), ప్రిన్సిపాల్ గంగాధర్, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, వెంకన్న గుప్తా, కృష్ణారెడ్డి, ఎజాజ్, దావుడ్ తదితరులు పాల్గొన్నారు.
Mla Pocharam | బోనమెత్తిన పోచారం దంపతులు
పట్టణంలోని ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలు తీశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి – పుష్ప దంపతులు బోనాలు ఎత్తుకున్నారు. మహిళలతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.