అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | కవులు ప్రజలను చైతన్యపర్చేలా కవితలు రాయాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన ‘కర్మజీవి’ (Karma jeevi) కవితా సంపుటిని శనివారం ఆయన ఆవిష్కరించారు. స్థానిక మార్కండేయ కల్యాణ మండపంలో (Markandeya Kalyana Mandapam) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి రచనలకు ఉందన్నారు. కార్యక్రమంలో కవులు గణపతి అశోక్ శర్మ (Poet Ganapati Ashok Sharma), కాసర్ల నరేష్ రావు, వీపీ చందన్ రావు, శ్రీమన్నారాయణ, వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్ (Doctors Boddula Rajendra Prasad), నగర పద్మశాలి సంఘం (Padmashali Sangham) అధ్యక్ష, కార్యదర్శులు పెంట దత్తాద్రి, చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు.