అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తూ విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయమని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (DIEO Ravi kumar) అన్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (Government Girls Junior College) హిస్టరీ అధ్యాపకులు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ సెల్ అధికారి నర్సయ్య సొంత డబ్బులతో హెచ్ఈసీ స్టడీ మెటీరియల్ (Study material), నోట్ బుక్కలను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉచిత మెటీరియల్ను వినియోగించుకొని ఉత్తమంగా రాణించాలని సూచించారు. అనంతరం మెటీరియల్ అందజేసిన నర్సయ్యను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బుద్దిరాజ్, అధ్యాపకులు పాల్గొన్నారు.