అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | యువత క్రీడలవైపు ఆకర్షితులవడం అభినందనీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మోస్రా (Mosra) మండలం చింతకుంటలో నిజామాబాద్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని (cricket tournament) ఆదివారం ప్రారంభించారు. ఈ టోర్నీని చింతకుంట క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎండీ ఆరీఫ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వంగ నీలిమ సాయ గౌడ్, ఇస్మాయిల్ సహకారంతో ఏర్పాటు చేశారు.
Mla Pocharam | ఉత్సాహంగా క్రికెట్ ఆడిన పోచారం..
ఈ సందర్భంగా క్రికెట్ బోర్డు సభ్యులను ఎమ్మెల్యే పోచారం అభినందించారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో టాస్ వేసి తొలి మ్యాచ్‌ను పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన అన్నారు. టోర్నమెంట్లో విజేతగా నిలిచే జట్టుకు రూ.33,333 నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచే జట్టుకు రూ. 15,555 నగదు బహుమతి అందజేస్తామని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
