అక్షరటుడే, బాన్సువాడ : Banswada | సామాజిక సేవా కార్యకర్త బంగారు సాయిలుకు అంబేడ్కర్ అవార్డు రావడం అభినందనీయమని బాన్సువాడ అంబేడ్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని అంబేడ్కర్ భవనంలో (Ambedkar Bhavan) జరగనున్న అభినందన సభకు నస్రుల్లాబాద్ నుంచి అంబేడ్కర్ సంఘం నాయకులు శనివారం భారీగా తరలివెళ్లారు.
నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన బంగారు సాయిలుకు బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు (Ambedkar Award) లభించింది. దీంతో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య (Bangaru Maisaiah) ఆధ్వర్యంలో నాయకులు బయలుదేరివెళ్లారు.
కార్యక్రమంలో బీసీ సంఘ నాయకుడు శంకర్ యాదవ్, అంబేడ్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గైనిరవి, బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షుడు మన్నే చిన్న సాయిలు, గంగాధర్, పోచారం మోహన్, పరిమళ సాయిలు, అంకోల్ సాయిరాం, బంగారు హరి ప్రసాద్, వాగ్మారే మారుతి, బేగరి శంకర్, శేట్లూరు పెద్ద సాయిలు, బాలరాజ్, పిట్లం సునీల్, రవి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
