అక్షరటుడే, బాన్సువాడ: Banswada BJP | సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవడం గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి యెండల లక్ష్మీనారాయణ(Yendala Lakshminarayana), జిల్లా ఇన్ఛార్జి విక్రంరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో బీజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి కార్యక్రమం నిర్వహించారు.
Banswada BJP | సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లకు సన్మానం
ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch election) గెలుపొందిన బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచినట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చాటుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఏడుగురు సర్పంచ్లు, ఆరుగురు ఉప సర్పంచ్లు, 29 మంది వార్డు మెంబర్లను సన్మానించారు.
Banswada BJP | రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో..
సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో (MPTC ZPTC Elections) బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకువెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనను చూశారని, వారి మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోలేదని అన్నారు.
Banswada BJP | ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, మజ్జిగ శ్రీనివాస్, హన్మాండ్లు యాదవ్, రమేష్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మక్కన్న, సాయిలు, చిరంజీవి, ఉమేష్, మహేష్ పాల్గొన్నారు.