Homeఫొటోలు & వీడియోలుViral Video | మందు కోసం వైన్​ షాపులోని ఇనుప గ్రిల్​లో తల పెట్టాడు.. ఆ...

Viral Video | మందు కోసం వైన్​ షాపులోని ఇనుప గ్రిల్​లో తల పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | మందు మత్తులో కొందరి ప్రవర్తన వారికి గుణపాఠంగా మారుతుంది. తాజాగా ఓ మందుబాబు చేసిన స్టంట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వైన్‌ షాప్‌లో మద్యం బాటిల్ కోసం మందు బాబు చేసిన పని చూస్తే నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. తల ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయి ఆయ‌న ప‌డిన బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) ట్రెండింగ్‌లో ఉంది.

అసలేం జరిగిదంటే.. మద్యం కోసం ఓ వ్యక్తి వైన్​ షాపునకు వచ్చాడు. అక్కడ బహుశా రద్దీ ఎక్కువగా ఉండొచ్చు, అందుకే అతను మద్యం బాటిల్‌ తీసుకునే క్రమంలో ఇనుప గ్రిల్‌లో తల పెట్టాడు. ఆ తల ఇక బయటికి రావడానికి చాలా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది.

Viral Video | కిక్కు దిగింది..

ఇరుక్కుపోయిన త‌ల‌ని తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆ స‌మ‌యంలో పక్కనే ఉన్న వారు చువ్వలను వంచే ప్రయత్నం చేశారు, తల లాగడానికి రకరకాలుగా కష్టపడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఎలాగోలా అతన్ని బయటకు తీశారు. ఆ వెంటనే మందుబాబు “హమ్మయ్య… బతికినాను బాబోయ్!” అనేలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చి అక్క‌డి నుండి వెళ్లిపోయాడు.

ఈ వీడియోను అక్కడే ఉన్న వారు షూట్ చేసి నెట్టింట పెట్టడంతో వైరల్ (Video Viral) అయింది. నెటిజన్లు Netigens ఫన్నీగా స్పందిస్తున్నారు.. ఇలాంటి టాలెంట్ మందుబాబులకే వస్తుంది, పీకలదాకా తాగితే తలే పోతుంది అన్న‌ది నిజ‌మే, మందు కోసం మరీ ఇంత ధైర్యం చేయాలా అంటూ ఎంతోమంది లాఫింగ్ ఎమోజీలు, మీమ్స్, సెటైర్స్ పోస్ట్ చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ సంఘటన చూసిన తరువాత మాత్రం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మద్యం మితంగా తీసుకుంటే సరదా, కానీ మితిమీరితే ఇలాగే తల ఇరుక్కోవాల్సిందే అంటూ కొంద‌రు హెచ్చ‌రిస్తున్నారు.

Related News