HomeUncategorizedAhmedabad Plane Crash | బతికి బయటపడతానని అనుకోలేదు.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ రమేశ్​

Ahmedabad Plane Crash | బతికి బయటపడతానని అనుకోలేదు.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ రమేశ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదంపై యావత్​ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్(London)​ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయిన విషయం తెలిసిందే. టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనాన్ని విమానం ఢీకొంది.

ఈ ప్రమాదంలో విమానంలో 242 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 11ఏ సీటులోని ప్రయాణికులు రమేశ్​ విశ్వాస్​కుమార్​ ఎమెర్జెన్సీ ఎగ్జిట్​ గేట్(Emergency exit gate)​ నుంచి దూకేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదం అనంతరం ఆయన శుక్రవారం తొలిసారి మీడియాతో మాట్లాడారు.

Ahmedabad Plane Crash | ఎలా జరిగిందో గుర్తులేదు

ప్రమాదంపై విశ్వాస్​ కుమార్(Ramesh Vishwas Kumar)​ మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తులేదన్నారు. తన కళ్ల ముందే విమానం కూలిపోయిందన్నారు. అంత పెద్ద ప్రమాదం నుంచి తాను బతికి బయటపడతానని అనుకోలేదని భావోద్వేగానికి లోనయ్యారు. విమానం టేక్ ఆఫ్ అయిన 10 సెకన్లలోనే స్టక్ అయినట్టు అనిపించిందని, గ్రీన్ లైట్లు వెలిగాయని చెప్పారు. హాస్టల్​పై పడగానే వెంటనే తాను బయటికి దూకేశానన్నారు. విమానం(Plane) కూలిపోవడంతో ఆ మంటలకు తనకు గాయాలైనట్లు ఆయన తెలిపారు.

Must Read
Related News