అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ బచ్చా అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ.. పొంగులేటి(Minister Ponguleti)పై విమర్శలు చేశారు. ఆయన అనుకోకుండా గెలిచారని వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి స్పందించారు. పాలేరులో తన గెలుపును ఆపడానికి కేసీఆర్(KCR) మూడు సార్లు ముక్కు నేలకు రాసిన.. ఆయన వల్లే కాలేదన్నారు. ‘‘నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి” అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల వరకు అసలు కేటీఆర్ ఇండియాలో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. సంచి సర్దుకుని అమెరికాకు వెళ్లిపోతారని చెప్పారు.
Minister Ponguleti | రెండు సార్లు బుద్ధి చెప్పారు
ప్రజల తీర్పును గౌరవించాలని పొంగులేటి హితవు పలికారు. అహంకారంతో మాట్లాడినందుకు ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారన్నారు. మూడో సారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. “నువ్వు నా పై పోటీ చేస్తావా.. లేదంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి కాంగ్రెస్ గెలిపిస్తాదా”అని పొంగులేటి అన్నారు.
Minister Ponguleti | బీఆర్ఎస్ ఏమవుతుందో..
దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సత్తా చూపించాలని మంత్రి పొంగులేటి సవాల్ చేశారు. ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏమవుతుందో చూసుకోవాలన్నారు. ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్‌లో మీ పార్టీ బలాన్ని చూపించండి అని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు(Jubilee Hills By Elcetions) త్వరలో జరగనున్నాయి. అక్కడ గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.