ePaper
More
    HomeతెలంగాణIT Bonala Jatara | నేడు ఐటీ బోనాల జాతర.. ఉద్యోగుల ఆధ్వర్యంలో ఊరేగింపునకు సర్వం...

    IT Bonala Jatara | నేడు ఐటీ బోనాల జాతర.. ఉద్యోగుల ఆధ్వర్యంలో ఊరేగింపునకు సర్వం సిద్ధం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: IT Bonala Jatara : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ప్రసిద్ధి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు నిత్యం కంప్యూటర్​, ల్యాప్​టాప్​ల ముందు బిజీగా గడుపుతూ ఉంటారు. ఎంతో బిజీ జీవితం గడిపే వీరు, సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. బోనాల జాతరకు బైలెళ్లబోతున్నారు.

    హైదరాబాద్​లో నేడు(జూన్​ 6) ఐటీ బోనాల జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) Telangana Information Technology Association (TITA) ఆధ్వర్యంలో ఈ వేడుక జరుపుతున్నారు. ఈ సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమంలో 21 ఐటీ కంపెనీల(IT companies)కు చెందిన 1,500 కు పైగా ఉద్యోగులు పాల్గొంటారని టీటా అధ్యక్షుడు సందీప్​ కుమార్​ మక్తాలా తెలిపారు.

    IT Bonala Jatara : ఊరేగింపు ఎక్కడంటే..

    నేడు(ఆదివారం) ఉదయం 9 గంటలకు హైటెక్​ సిటీ(Hitech City) వద్ద ఉన్న శిల్పారామం (Shilparamam) నుంచి చిన్న పెద్దమ్మ దేవస్థానానికి బోనాల ఊరేగింపు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ వేడుక చేపడుతున్నారు. ఈ వేడుకల్లో పోతురాజులు, శివసత్తులు, గుస్సాడి వంటి జానపద కళలు ఆకట్టుకోనున్నట్లు టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా చెప్పారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...