HomeUncategorizedIncome Tax Bill | ఐటీ బిల్లు-2025 వెన‌క్కి.. ఉప‌సంహ‌రించుకున్న కేంద్రం

Income Tax Bill | ఐటీ బిల్లు-2025 వెన‌క్కి.. ఉప‌సంహ‌రించుకున్న కేంద్రం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Income Tax Bill | లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను (Income Tax Bill 2025) కేంద్ర ప్ర‌భుత్వం (Central government) శుక్ర‌వారం వెన‌క్కి తీసుకుంది. దీని స్థానంలో త్వ‌రలోనే కొత్త బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది. ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2025ను కేంద్రం అధికారికంగా ఉపసంహరించుకుంది.

అయితే, బైజయంత్ పాండా అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ సిఫార్సులను కలుపుకొని సవరించిన బిల్లును ఆగస్టు 11న లోక్‌స‌భ‌లో (v) ప్రవేశపెట్టనున్న‌ట్లు తెలిసింది. బిల్లు బహుళ వెర్షన్‌ల ద్వారా గందరగోళాన్ని నివారించడానికి, అన్ని మార్పులతో కూడిన స్పష్టమైన, నవీకరించిన‌ సంస్కరణల‌తో ఆదాయపు పన్ను బిల్లును సోమవారం సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.

Income Tax Bill | సెలెక్ట్ క‌మిటీ సూచ‌న‌ల‌తో..

ఆదాయ‌ప‌న్ను బిల్లు-2025ను కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఫిబ్ర‌వ‌రిలో లోక్‌స‌భ ముందుకు తీసుకొచ్చింది. అయితే, కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన త‌రుణంలో సెల‌క్ట్ క‌మిటీకి పంపించింది. ఈ నేప‌థ్యంలో సుదీర్ఘ‌ విచార‌ణ త‌ర్వాత కమిటీ జూలై 21న పార్లమెంటుకు (Parliament) 4,500 పేజీలతో తన నివేదికను సమర్పించింది. ఐటీ యాక్ట్‌-1961 చట్టం స్థానంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 ముసాయిదాను మెరుగుపరచడానికి 285 సూచనలు చేసింది. అనేక ప్రతిపాదనలలో, సాధారణ పన్ను చెల్లింపుదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చేలు సూచ‌న‌లు చేప‌ట్టాల‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే ఆయా సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేసి కొత్త బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

Must Read
Related News