Homeజిల్లాలుకామారెడ్డిCollector Kamareddy | రామారెడ్డి వైద్యాధికారికి షోకాజ్ నోటీస్​ ఇవ్వండి..: కలెక్టర్​

Collector Kamareddy | రామారెడ్డి వైద్యాధికారికి షోకాజ్ నోటీస్​ ఇవ్వండి..: కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యాధికారులు తరచుగా డుమ్మా కొడుతున్నారు. అలాంటి వారిపై కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం దేవునిపల్లి పీహెచ్​సీలో (Devunipalli PHC) వైద్యాధికారి గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యాధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ (Rama Reddy Primary Health Center) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

రామారెడ్డి పీహెచ్​సీని కలెక్టర్​ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సురేష్ అందుబాటులో ఉండడం లేదని ప్రజలు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్​ను (Medical Officer Chandrasekhar) ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Collector Kamareddy | ఆస్పత్రి సేవలపై సంతృప్తి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్నటువంటి సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి రామారెడ్డి ఆస్పత్రిలో సేవల గురించి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో అందుతున్న సేవల గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం తాడ్వాయి మండలం దేమికలాన్​లో ప్రబలిన అతిసార వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. వైద్య సిబ్బంది అప్రమత్తంగాఉండాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం గానీ అశ్రద్ధ వహిస్తే సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు.