ePaper
More
    Homeఅంతర్జాతీయంIran-Israel | ఇరాన్‌ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు

    Iran-Israel | ఇరాన్‌ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Iran-Israel | ఇరాన్​– ఇజ్రాయెల్​ మధ్య యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్​లోని అణుస్థావరాలే(Nuclear power plants) లక్ష్యంగా ఇజ్రాయెల్​ దాడులు చేపట్టగా.. ఇరాన్​ ప్రతిదాడులతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. రెండు దేశాలు వెనక్కి తగ్గకుండా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి.

    Iran-Israel | దాడులను ఖండించాలి

    ఈ క్రమంలో ఇరాన్​లోని క్షిపణి స్థావరాలు, కీలక అణుకేంద్రాలపైనా టెల్అవీవ్(Tel Aviv)​ దాడులు చేస్తోంది. ఇరాన్‌ కూడా ప్రతిదాడులు చేస్తుండటంతో సైరన్​లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు భయంతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులను భారత్(India) ఖండించాలని ఇరాన్‌ కోరుతోంది. ఇరుదేశాల యుద్ధంపై భారత్​ తటస్థంగా ఉంది. రెండు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని భారత్​ సూచించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. అయితే ఇరాన్​ మాత్రం దాడులను ఖండించాలని భారత్​ను కోరుతోంది. ఇరాన్‌ నష్టపోతే మిగితా దేశాలపైనా ఆ ప్రభావం పడుతుంది ఇరానియన్‌ ఎంబసీ(Iranian Embassy) పేర్కొంది.

    Iran-Israel | భారతీయుల తరలింపు

    యుద్ధం నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చర్యలు చేపట్టింది. భారతీయుల తరలింపు కోసం ఇప్పటికే ఇరాన్​ తన గగనతలాన్ని తెరిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు పలువురు భారతీయు ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానాల్లో అక్కడ చిక్కుకున్న వారిని తరలిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...