ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael Strikes | హోతీలకు షాక్​.. రెబ​ల్ ప్రభుత్వ ప్రధానిని హతమార్చిన ఇజ్రాయెల్​

    Israel Strikes | హోతీలకు షాక్​.. రెబ​ల్ ప్రభుత్వ ప్రధానిని హతమార్చిన ఇజ్రాయెల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Strikes | ఇజ్రాయెల్​ (Israel) యెమెన్​పై విరుచుకుపడింది. హోతీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో యెమెన్​లో రెబల్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ముజాహిద్‌ అహ్మద్‌ గాలీబ్‌ అల్‌-రహావీ హతమయ్యారు.

    యెమెన్ (Yemen)​ రాజధాని సనాలో గురువారం ఇజ్రాయెల్​ వైమానిక దాడులు చేపట్టింది. రెబల్​ ప్రభుత్వ అధినేతలే లక్ష్యంగా ఈ దాడులకు చేపట్టగా.. ప్రధాన మంత్రితో పాటు పలువురు మంత్రులు మృతి చెందారు. వారి మృతిని హోతీలు ధ్రువీకరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేశారు.

    Israel Strikes | ప్రతీకారం తీర్చుకుంటాం

    యెమెన్​లో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇరాన్​ మద్దతు ఉన్న హోతీలు (Houthis) సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2024 ఆగస్టు నుంచి రెబెల్​ ప్రభుత్వం నడుస్తుండగా.. ప్రధానిగా రహావీ కొనసాగుతున్నారు. ఉత్తర యెమెన్​పై పట్టున్న హోతీలు 2014లో సనా నగరాన్ని ఆక్రమించుకున్నారు. కాగా.. తమ ప్రధాని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హోతీలు ప్రకటించారు. టెల్​అవీవ్​ దాడులను ఎదుర్కొంటామని పేర్కొన్నారు. “మేము ప్రతీకారం తీర్చుకుంటాం, గాయాల లోతుల్లోంచి విజయాన్ని సాధిస్తాము” అని హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ఛైర్మన్‌, సైనిక అధికారి మహదీ అల్-మషత్ ఒక వీడియో సందేశంలో తెలిపారు.

    Israel Strikes | 12 మంత్రులు మృతి!

    సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని ఇజ్రాయెల్​ తెలిపింది. అయితే దేశంలో అభివృద్ధి పనులపై గురువారం ప్రధాని రహావీ మంత్రులతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమయంలో టెల్అవీవ్​ వైమానిక దాడులు చేపట్టింది. ఈ ఘటనలో ప్రధానితో పాటు 12 మంత్రులను హత మార్చినట్లు ఇజ్రాయెల్​ అనధికారికంగా తెలిసింది. హోతీ రెబల్స్​ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఐడీఎఫ్​ ప్రకటించింది. మరిన్ని దాడులు చేస్తామని హోతీలను హెచ్చరించింది. కాగా హోతీలు హమాస్​కు మద్దతు తెలుపున్నారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్​ సరకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్​ వారిపై దాడులు చేపట్టింది.

    More like this

    High Court | హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గ్రూప్‌1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | గ్రూప్‌1 ప‌రీక్ష‌లపై తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువరించింది....

    Nepal Government | వెన‌క్కి త‌గ్గిన నేపాల్ ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియాపై నిషేధం ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Government | నేపాల్ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. సోష‌ల్ మీడియా సైట్‌లపై విధించిన...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...