HomeUncategorizedIsrael bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని ఆర్మీ హెడ్​ క్వార్టర్ army headquarters ​పై వైమానిక దాడి చేసి దానిని పీల్చేసింది. సిరియాలోని స్వైదా Sweida ప్రావిన్స్ లో రెండు తెగల మధ్య ఘర్షణలు తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సిరియా సైనిక ప్రధాన కార్యాలయాన్ని పేల్చేసింది.

Israel bombed Syria : ద్రూజ్​ పౌరులపై దురాగతాలకు ప్రతీకారం..

ద్రూజ్ Druze పౌరులపై సిరియా సర్కారు దురాగతాలకు పాల్పడుతోందనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందుకు ప్రతీకారంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. స్వైదాలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో 250 మందికి పైగా మరణించినట్లు వార్తలు ఉన్నాయి. ఈ క్రమంలో ద్రూజ్ ప్రజలను కాపాడేందుకు జోక్యం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

Israel bombed Syria : రెండు తెగల మధ్య వివాదం..

సిరియాలోని స్వైదా ప్రావిన్సు రెండు తెగల సాయుధ ఘర్షణలతో అట్టుడుకుతోంది. అందుకే సిరియా రాజధాని డమాస్కస్​లో ఉన్న సైనిక ప్రధాన కార్యాలయంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానికి దాడికి పాల్పడింది.

Israel bombed Syria : స్వైదా ఘర్షణలు

స్వైదా ప్రావిన్స్ లో స్థానిక ద్రూజ్ మిలీషియా, సిరియా సర్కారు బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవలే రద్దు అయింది. దీంతో ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారాయి.

ద్రూజ్ తెగపై హింస మరింత పెరిగింది. దీనికి తోడు ఇజ్రాయెల్​ సరిహద్దులకు సమీపంలో ఇస్లామిక్ మిలీషియా గ్రూప్ మళ్లీ కార్యకలాపాలు చురుగ్గా సాగించడాన్ని గుర్తించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కలగజేసుకుంది. ద్రూజ్ తెగను కాపాడేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ప్రకటించిన విధంగానే బుధవారం రాత్రి సిరియన్ రక్షణ మంత్రిత్వ శాఖతోపాటు, రాజధాని డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో దాడులకు దిగింది. ఈ వైమానిక దాడిలో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారు.

Must Read
Related News