ePaper
More
    HomeజాతీయంIsrael - Iran | 200 యుద్ధ విమానాలతో దాడి చేసిన ఇజ్రాయెల్

    Israel – Iran | 200 యుద్ధ విమానాలతో దాడి చేసిన ఇజ్రాయెల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Israel – Iran | ఇరాన్​ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ చేసిన దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 యుద్ధ విమానాలతో ఇరాన్​లోని వంద లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తంలో యుద్ధ విమానాలు(Fighter jets) దాడులు చేస్తున్నా.. ఇరాన్​ రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థ స్పందించలేదు. దీనికి కారణం ముందుగానే మొస్సాద్​(ఇజ్రాయెల్​ నిఘా సంస్థ) కోవర్టు ఆపరేషన్​(Covert operation) చేపట్టి వాటిని నిర్వీర్యం చేసినట్లు సమాచారం.

    Israel – Iran | కోవర్టు ఆపరేషన్లతో..

    మొస్సాద్​ రహస్య ఆపరేషన్లు(Mossad covert operations) చేపట్టి ఇరాన్​ గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బ తీసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి టెల్​ అవీవ్​ దాడులకు అడ్డు లేకుండా పోయింది. ఏ దేశం అయినా దాడులకు పాల్పడే ముందు శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది. ఇటీవల పాకిస్తాన్​ ఉద్రిక్తతల సమయంలో భారత్​ కూడా పాక్​లోని రాడార్లు, గగనతల రక్షణ సిస్టమ్​పై దాడి చేసింది. అయితే క్షిపణులు, డ్రోన్లతో వీటిని ధ్వంసం చేస్తారు. కానీ ఇజ్రాయెల్​ మాత్రం మొస్సాద్​ను రంగంలోకి దింపి కోవర్టు ఆపరేషన్​ ద్వారా చేపట్టడం గమనార్హం.

    Israel – Iran | 330 క్షిపణుల వినియోగం

    ఇజ్రాయెల ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌(Operation Rising Lion)లో భాగంగా ఇరాన్‌పై 200 యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్​ అధికారులే(IDF officers) స్వయంగా వెల్లడించారు. మొత్తం 100 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వినియోగించినట్లు వివరించారు.

    Israel – Iran | కీలక నేతలు, సైంటిస్టుల మృతి

    ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్​ ఆర్మీ చీఫ్‌ బాఘేరి(Iranian Army Chief Bagheri), ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ హోస్సేన్ సలామీ సహా పలువురు కీలక నేతలు మృతి చెందారు. పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. దీంతో ఇరాన్​ ఆర్మీ తాత్కాలిక చీఫ్గా హబైబొల్లా సయ్యారి(Habibolla Sayyari)ని నియమించింది.

    Israel – Iran | డ్రోన్లతో దాడులు చేస్తున్న ఇరాన్

    ఇజ్రాయెల్​ దాడులకు ప్రతీకారంగా ఇరాన్​ డ్రోన్ల(Iran drones)తో దాడులకు పాల్పడుతోంది. వందల డ్రోన్లను తమ దేశం మీదకు ప్రయోగించినట్లు ఐడీఎఫ్​ తెలిపింది. వాటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    Israel – Iran | భారత్​ ఆందోళన

    ఇరాన్​– ఇజ్రాయెల్​ ఉద్రిక్తతలపై భారత్(Bharath)​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుదేశాలు దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్​ దాడులను సౌదీ ఖండించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...