ePaper
More
    HomeజాతీయంIran - Israel | భారత్​కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్​.. ఎందుకో తెలుసా

    Iran – Israel | భారత్​కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్​.. ఎందుకో తెలుసా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Iran – Israel | ఇరాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా గురువారం రాత్రి ఇజ్రాయెల్​ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ రైజింగ్​ లయన్​(Operation Rising Lion) పేరిట దాదాపు 200 యుద్ధ విమానాలతో ఇరాన్​పై విరుచుకుపడింది. ఇరాన్​లోని అణుస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఆ దేశ అణు శాస్త్రవేత్తలు(Nuclear scientists), మిలటరీ కీలక నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం ఇరాన్​ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్(Israel)​ విడుదల చేసిన ఓ మ్యాప్​ వివాదాస్పదమైంది. దీంతో ఆ దేశం భారత్​(Bharath)కు క్షమాపణ చెప్పింది.

    Iran – Israel | ఇరాన్​ మిసైల్​ పరిధి చూపేలా..

    ఇరాన్(Iran)​తో ఉద్రిక్తతల వేళ ఆ దేశ క్షిపణుల పరిధి తెలిపేలా ఓ మ్యాప్​ విడుదల చేసింది. ఆ మ్యాప్​లో భారత్​ను తప్పుగా చూపించింది. జమ్మూ కశ్మీర్​ను పాకిస్తాన్​లో, ఈశాన్య రాష్ట్రాలను నేపాల్​లో ఉన్నట్లు మ్యాప్​ ఉంది. దీనిపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ ఈ విషయాన్ని ఇజ్రాయెల్​ దృష్టికి తీసుకుళ్లింది. దీంతో స్పందించి ఆ దేశం భారత్​కు క్షమాపణ చెప్పింది.

    Iran – Israel | ఇది ఆరంభం మాత్రమే..

    ఇరాన్​ మిసైళ్లతో(Iran missiles) ప్రపంచానికి ముప్పు ఉందని చెప్పేందుకు ఆ దేశ క్షిపణుల పరిధిని సూచిస్తూ ఇజ్రాయెల్​ ఢిపెన్స్​ ఫోర్స్​ (IDF) మ్యాప్​ విడుదల చేసింది. ఆ మ్యాప్​ ప్రకారం ఇరాన్​ క్షిపణుల పరిధిలోకి భారత్​, రష్యా, చైనా సహా 15 దేశాలు వస్తున్నాయి. దీంతో ఇరాన్​ అణు శక్తిగా మారితే ప్రపంచానికి ముప్పు పొంచి ఉంటుందని ఐడీఎఫ్(Israel Defense Force)​ పేర్కొంది. దీంతోనే తాము దాడి చేశామని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొంది. తమకు మరో అవకాశం లేదని ఇజ్రాయెల్​ తెలిపింది. అయితే మ్యాప్​లో భారత్​ను తప్పుగా చూపెట్టడంపై ఆ దేశం క్షమాపణ చెప్పింది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...