HomeUncategorizedIsrael | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

Israel | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇజ్రాయెల్​, గాజా మధ్య యుద్ధం (Israel-Gaza War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్​ (Hamas) ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇజ్రాయెల్​ దళాలు (IDF) గాజాపై విరుచుకు పడుతున్నాయి. నెలలుగా సాగుతున్న ఈ పోరులో ఇజ్రాయెల్​ ఇప్పటికే పలువురు హమాస్​ కీలక నేతలను హతం చేసింది. తాజాగా మరో కీలక నేత, మిలిటరీ కంట్రోల్ విభాగాధిపతి నాసర్ మూసా (Nasser Musa)ను అంతం చేసింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాసర్ మూసా మృతి చెందినట్లు ఐడీఎఫ్​ శుక్రవారం ప్రకటించింది. నాసర్ మూసా మృతితో హమాస్ కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్​ పేర్కొంది.

Israel | నియంత్రణ విభాగం అధిపతి

దక్షిణ గాజా (South Gaza)లో పలు స్థావరాలే లక్ష్యంగా గత వారం ఐడీఎఫ్​ వైమానిక దాడులు చేపట్టింది. ఆగస్టు 9న చేపట్టిన ఈ దాడుల్లో రఫా బ్రిగేడ్‌లోని హమాస్ నియంత్రణ విభాగం అధిపతి నాసర్ ముసా ఖాన్ యూనిస్‌లో మరణించినట్లు ఇజ్రాయెల్​ సైన్యం తెలిపింది. బ్రిగేడ్‌లోని యోధుల సంసిద్ధత, శిక్షణ విన్యాసాలను ముసా పర్యవేక్షించేవాడని పేర్కొంది. కాగా మూసా రఫా బ్రిగేడ్ కమాండర్ మొహమ్మద్ షబానాకు సన్నిహితుడు. అతడిని ఐడీఎప్​ మేలో మట్టుబెట్టింది.

మరోవైపు గురువారం సైతం ఐడీఎఫ్​ గాజాపై వైమానిక దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు హమాస్ కార్యకర్తలు రాకెట్లను నిల్వ చేయడానికి ఉపయోగించే ఖాన్ యూనిస్‌లోని భవనంపై దాడి చేశాయి. కాగా గాజా నగరాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని ఇదివరకే ఇజ్రాయెల్ (Israel)​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడులు ఉధృతం చేసింది. గాజాలోని ప్రజలకు మానవతా సాయం అందిస్తూనే నగరాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Must Read
Related News