HomeతెలంగాణIsmailKhanPeta Polytechnic College | తప్పతాగి అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్రపోయిన వాచ్​మన్​.. పాలిటెక్నిక్​...

IsmailKhanPeta Polytechnic College | తప్పతాగి అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్రపోయిన వాచ్​మన్​.. పాలిటెక్నిక్​ కాలేజీ హాస్టల్​లో ఘటన.. నెట్టింట వైరల్​!

IsmailKhanPeta Polytechnic College | విద్యార్థుల వసతి గృహంలో పనిచేసే ఓ తాగుబోతు వాచ్​మన్​ దుర్మార్గంగా ప్రవర్తించాడు. మద్యం తాగిన మత్తులో ఏకంగా అన్నం గిన్నెలోనే కాలు పెట్టి నిద్రపోయాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IsmailKhanPeta Polytechnic College | మందుబాబులు చేసే పనులు కంపరంగా ఉంటాయి. తప్పతాగి వెర్రిగా ప్రవర్తిస్తూ ఎదుటివారికి చిర్రెక్కిస్తుంటారు. తాగిన మైకంలో కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తుంటారు.

తాజాగా ఓ మందుబాబు తాగిన మైకంలో చేసిన పనికి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

IsmailKhanPeta Polytechnic College | సంగారెడ్డిలో..

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి Sangareddy జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల  ఉంది. దీనికి అనుబంధంగా వసతిగృహంలో వాచ్​మన్​గా నరేశ్​ అనే వ్యక్తి ఉన్నాడు.

కాగా, ఇతడో పెద్ద తాగుబోతు. ఈ క్రమంలోనే ఇటీవల ఫూటుగా మద్యం తాగాడు. భోజనాలు వడ్డించే ప్లాట్​ఫామ్​పై ఉన్న అన్నం బానాలీ(గిన్నె)లో డర్టీగా ఉన్న తన కాలును పెట్టి గాఢ నిద్రలో మునిగిపోయాడు.

మధ్య మధ్యలో కాలు ఆడిస్తూ గుర్రు కొడుతూ ఉండిపోయాడు. కాగా, ఈ వ్యవహారం చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్​ అయ్యారు. వెంటనే వీడియోను చిత్రీకరించి ఉన్నతాధికారులకు చేరవేశారు.

వాచ్​మన్​ నరేశ్​ చేసిన వ్యవహారాన్ని వీడియోలో చూసిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత డిపార్ట్​మెంట్​ అధికారులను ఆదేశించారు. అలా నరేశ్​ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

Must Read
Related News