Homeఅంతర్జాతీయంIslamabad bomb attack | ఇస్లామాబాద్ బాంబు దాడితో పాకిస్తాన్‌లో కలకలం.. ప్రాణ భయంతో స్వదేశానికి...

Islamabad bomb attack | ఇస్లామాబాద్ బాంబు దాడితో పాకిస్తాన్‌లో కలకలం.. ప్రాణ భయంతో స్వదేశానికి శ్రీలంక ఆటగాళ్లు!

Islamabad bomb attack | ఇస్లామాబాద్‌లో జరిగిన భయానక బాంబు దాడిలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనతో పాకిస్తాన్‌లో పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు తీవ్ర భయాందోళనకు గురైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Islamabad bomb attack | పాకిస్తాన్‌లో Pakistan మళ్లీ పరిస్థితులు ఉత్కంఠంగా మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు అంతా స‌ద్దుమ‌ణిగిన‌ట్టు కనిపించినా.. తాజాగా జరిగిన బాంబు దాడితో పాక్ ప‌రిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారాయి. ఇస్లామాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఉగ్రదాడి terrorist attack లో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో అక్కడ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు Sri Lankan cricket team తీవ్ర భయాందోళనకు గురైంది. తాజా సమాచారం ప్రకారం, శ్రీలంక జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు భద్రతా కారణాలతో పాకిస్తాన్‌ను విడిచి స్వదేశానికి వెళ్లిపోయారు.

ఈ పరిణామంతో నవంబరు 14న జరగాల్సిన పాకిస్తాన్ – శ్రీలంక రెండో వన్డేపై అనుమానాలు మొదలయ్యాయి. సిరీస్‌ కొనసాగుతుందా.. రద్దవుతుందా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి.

Islamabad bomb attack | సిరీస్‌ రద్దు..

పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత, జింబాబ్వే, పాక్‌లతో త్రైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉన్న శ్రీలంక Srilanka జట్టు ఇప్పుడు ఆ ప్రణాళికలను పక్కన పెట్టింది.

అయితే, స్వదేశానికి వెళ్లిన ఆటగాళ్ల స్థానంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను పంపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు Sri Lanka Cricket Board ప్రయత్నిస్తోంది. అయినా, రేపటి మ్యాచ్‌ జరగడం చాలా కష్టమనేది విశ్లేషకుల అభిప్రాయం.. ఈ ఘటనతో 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రదాడి మళ్లీ గుర్తుకొస్తోంది.

ఆ దాడిలో అజంతా మెండిస్‌, చమిందా వాస్‌, మహేళ జయవర్థనే వంటి పలువురు లంక ప్లేయర్లు గాయపడ్డారు. ఆ తర్వాత దాదాపు 14 సంవత్సరాలపాటు పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది.

ఇటీవల న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ Englandవంటి జట్లు కూడా సెక్యూరిటీ సమస్యల కారణంగా పాక్ పర్యటనలను రద్దు చేసుకున్నాయి. తాజాగా ఇస్లామాబాద్‌ బాంబు బ్లాస్ట్‌తో మళ్లీ పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌పై ముసురు కమ్మే అవకాశముందని భావిస్తున్నారు.

రావల్పిండిలో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. రెండో వన్డే జరగకపోతే ఈ సిరీస్‌ కూడా మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద, ఇస్లామాబాద్‌ బాంబు దాడి పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొల్పింది.

Must Read
Related News