HomeతెలంగాణJagannath Rath Yatra | ఇస్కాన్ సేవలు అభినందనీయం

Jagannath Rath Yatra | ఇస్కాన్ సేవలు అభినందనీయం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హిందూ సమాజంలో సంస్కారాన్ని నింపుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్ అన్నారు. కంఠేశ్వర్ ఇస్కాన్ (Kanteshwar ISKCON) ఆధ్వర్యంలో జూలై 4న నిర్వహించే జగన్నాథ రథయాత్రకు (Jagannath Rath Yatra) సంబంధించి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులంతా భగవంతుడు సూచించిన మారర్గం భగవద్గీత, రామాయణ, మహాభారతాలను చదవడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో వాటిని ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇస్కాన్ కంఠేశ్వర్ అధ్యక్షుడు రామానందరాయ ప్రభుదాస్, స్వామి యాదవ్, ఎండల సుధాకర్, రఘు ఇస్కాన్ కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.

Must Read
Related News