అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ishan Kishan Marriage Date | భారత క్రికెట్ జట్టులో దూసుకుపోతున్న యువ ఆటగాడు ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల పాకిస్థాన్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఆకట్టుకోవడంతో పాటు, అతడి పెళ్లి అంశం కూడా సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఇషాన్ తాత రామ్ అనురాగ్ పాండే చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇషాన్ వివాహం టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తర్వాత జరిగే అవకాశముందని రామ్ అనురాగ్ పాండే తెలిపారు. ముఖ్యంగా తన మనవడు ఎవరిని ఇష్టపడితే వారినే పెళ్లి చేసుకునేందుకు కుటుంబం పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో కూడా కుటుంబంలో పెద్ద మనవడికి ఇదే విధానాన్ని అనుసరించామని, పిల్లల ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.
Ishan Kishan Marriage Date | అదితితో రిలేషన్..
ఇషాన్ ప్రస్తుతం రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్ అదితి హుందియాతో రిలేషన్షిప్లో ఉన్నాడనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. 2018లో మిస్ దివా విజేతగా నిలిచిన అదితి (Aditi Hundia) మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఫ్యాషన్ రంగంలో మంచి గుర్తింపు సంపాదించడమే కాకుండా సొంత ఫ్యాషన్ బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇషాన్–అదితి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోందనే ప్రచారం ఉంది. ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో అదితి స్టేడియంలో ప్రత్యక్షమై ఇషాన్‌కు మద్దతుగా కనిపించడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.
మరోవైపు పాకిస్థాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ప్రదర్శనపై రామ్ అనురాగ్ పాండే హర్షం వ్యక్తం చేశారు. తన మనవడు ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఆడాలని దేవుడిని ప్రార్థిస్తానని తెలిపారు. పాక్‌పై హాఫ్ సెంచరీ సాధించినప్పుడు ఎంతో గర్వంగా అనిపించిందని చెప్పారు. మ్యాచ్‌కు ముందు ఇషాన్‌తో పాటు అభిషేక్ శర్మకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చానని, తొలి 10 ఓవర్లలో 100 పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని సూచించానని గుర్తు చేసుకున్నారు. భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఇషాన్ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్లోనూ ఇషాన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కుటుంబం అండగా ఉంటుందని తాత స్పష్టం చేయడం ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.