Homeక్రీడలుIshan Kishan | రిక్షాలో అదిరిపోయే డ్యాన్స్‌తో మైండ్ బ్లాక్ చేసిన ఇషాన్ కిష‌న్.. వైర‌ల్​గా...

Ishan Kishan | రిక్షాలో అదిరిపోయే డ్యాన్స్‌తో మైండ్ బ్లాక్ చేసిన ఇషాన్ కిష‌న్.. వైర‌ల్​గా మారిన వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ishan Kishan | భోజ్‌పురి పాటలకు దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా క్రేజ్ విప‌రీతంగా పెరుగుతోంది. పెళ్లిళ్లు, పార్టీలలో ప్రజలు ఈ పాటలకు స్టెప్పులు వేయడం కామ‌న్ అయిపోయింది. తాజాగా, టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఓ భోజ్‌పురి పాటకు(Bhojpuri song) డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ టీమ్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు. అయితే బ్రేక్ టైంలో తన స్నేహితుడితో కలిసి రిక్షాలో ప్రయాణిస్తుండగా, ఓ జోష్‌ఫుల్ భోజ్‌పురి పాట విన్నాడు.

Ishan Kishan | ఫన్నీ రైడ్..

వెంటనే మ్యూజిక్‌కు ఊగిపోతూ ఇద్దరూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. వారి డ్యాన్స్ అక్క‌డి వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. “ఇషాన్ స్టైల్ అదుర్స్”, “భోజ్‌పురి స్టెప్పులు ఇంగ్లండ్‌లో?” అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఇషాన్ కిష‌న్.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్‌ను హ‌గ్ చేసుకున్నాడు. భారత–పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇషాన్ చేసిన ప‌నిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. మ‌రి కొంద‌రు మాత్రం ఇషాన్ కిషన్ ఇలా ప్రత్యర్థి దేశ క్రికెటర్‌తో స్నేహపూర్వకంగా మెలగడం అసలైన స్పిరిట్ ఏంటో చూపించింది అని అన్నారు.

భారత్, పాకిస్తాన్ జట్లు సాధారణంగా ఐసీసీ టోర్నీల్లోనే(ICC Tournament) తలపడతాయి అన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో దారుణంగా నిరాశ‌ప‌రిచిన ఇషాన్ కిష‌న్ ప్ర‌స్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌(County Championship)లో ఆడుతున్నాడు. ఇందులో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరిచి తిరిగి జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తిరిగి ‘సి’ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్, త్వరలోనే మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చి తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మొత్తానికి లండ‌న్‌(London)లో ఇషాన్ ‘బిహారీ’ జాయ్ రైడ్ అందరినీ నవ్వించ‌డంతో పాటు అల‌రిస్తోంది.

Must Read
Related News