అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka CM | కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసినట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో సీఎం మార్పుపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీతో సమస్య పరిష్కారం అయినట్లు సమాచారం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ గెలుపు కోసం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) తీవ్రంగా కృషి చేశారు. దీంతో సీఎం పీఠాన్ని ఇద్దరు ఆశించారు. అధిష్టానం మాత్రం సీఎం సిద్ధరామయ్యకు పదవి ఇచ్చింది. అయితే ఆ సమయంలో రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌ను సీఎం చేస్తారని ఒప్పందం జరిగినట్లు ఆయన వర్గం వారు పేర్కొంటున్నారు. నవంబర్ 20తో రెండున్నరేళ్లు కావడంతో డీకేను సీఎం చేయాలని వారు కోరుతున్నారు. ఈ వివాదం అధిష్టానం (high command) దృష్టికి వెళ్లడంతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం సీఎం, డిప్యూటీ సీఎం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
Karnataka CM | చర్చలు సఫలం
సమావేశం అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. డీకే శివకుమార్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేయాలని కేసీ వేణుగోపాల్ (KC Venugopal) చెప్పారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. గందరగోళానికి పుల్‌స్టాప్ పెట్టాలనే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. 2028 ఎన్నికల స్ట్రాటజీపై చర్చించామన్నారు. ఇద్దరి మధ్య చర్చలు ఫలవంతం అయ్యాయని డీకే శివకుమార్ వెల్లడించారు. కర్నాటక ప్రాధాన్యాలపై చర్చించామన్నారు.
Karnataka CM | హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తాం
తనకు, శివకుమార్‌కు మధ్య ఎటువంటి విభేదాలు లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ఇద్దరు నాయకుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నంలో కాంగ్రెస్ హైకమాండ్ (Congress high command) ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. అల్పాహారం బాగుందని సీఎం తెలిపారు. అక్కడ తాము ఏమీ చర్చించలేదన్నారు. “ఈ రోజు శివకుమార్ తన ఇంటికి వచ్చారని, తనను ఆయన ఇంటికి ఆహ్వానించారని చెప్పారు.
Karnataka CM | మళ్లీ అధికారమే లక్ష్యం
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్‌లో ఉండవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. తిరిగి అధికారంలోకి తీసుకురావడం గురించి చర్చించామన్నారు. రేపటి నుంచి ఎలాంటి గందరగోళం ఉండదన్నారు. కొంతమంది మీడియా రిపోర్టర్లు గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు.