ePaper
More
    Homeక్రీడలుVirat Kohli | అతని ఒత్తిడి వల్లే అశ్విన్, రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్?

    Virat Kohli | అతని ఒత్తిడి వల్లే అశ్విన్, రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌(International cricket)కు వీడ్కోలు పలికాడు. సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సంతృప్తికరంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గౌతమ్ గంభీర్ కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు తప్పుకున్నారని, గంభీర్ ఒత్తిడిని తట్టుకోలేకనే టెస్ట్ టీమ్ నుంచి వైదొలిగారని కామెంట్ చేస్తున్నారు.

    న్యూజిలాండ్‌(New Zealand)తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై భారత్ క్లీన్ స్వీప్(India clean sweep) అవ్వడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌తో పాటు అశ్విన్ దారుణంగా విఫలమయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఈ ముగ్గురు తీవ్రంగా నిరాశపరిచారు. అశ్విన్‌కు బ్యాకప్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకోవడంతో పాటు తుది జట్టులో చోటివ్వలేదు. మూడో టెస్ట్‌ ఆడినా.. అతను పెద్దగా రాణించలేదు. దాంతో అశ్విన్ రిటైర్మెంట్(Ashwin retirement) ప్రకటించి స్వదేశానికి వచ్చేశాడు.

    గంభీర్(Gambhir) వ్యవహార శైలితోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్(Rohit Sharma retirement) ప్రకటించాడు. అతన్ని ఆటగాడిగా కూడా ఎంపిక చేసేందుకు సిద్దంగా లేమని సెలెక్టర్లు చెప్పడంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. గంభీర్ వ్యవహార శైలి నచ్చకనే విరాట్ కోహ్లీ(Virat Kohli) తప్పుకున్నట్లు తెలుస్తోంది. గంభీర్ కారణంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకేసారి తప్పుకోవడం.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక సెలెక్టర్లకు సవాల్‌గా మారింది.

    Latest articles

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    More like this