ePaper
More
    HomeజాతీయంAlimony | భరణం భారంగా మారుతోందా.. మగాళ్ల పరిస్థితి ఏమిటీ?

    Alimony | భరణం భారంగా మారుతోందా.. మగాళ్ల పరిస్థితి ఏమిటీ?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Alimony | దేశంలో విడాకుల కేసులు పెరిగాయి. పెళ్లయిన మూణ్ణాళ్లకే చాలా జంటలు విడిపోతున్నాయి. బాగా చదువుకున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అయితే విడాకులు తీసుకునే సమయంలో మహిళలు భర్తల నుంచి భరణం(Alimony) అడుగుతున్నారు. అయితే అది భారంగా మారుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    Alimony | పని చేసే అవకాశం ఉన్నా..

    చాలా వరకు బాగా చదువుకున్న, ఉన్నత వర్గాలకు చెందిన వారిలోనే ఎక్కువగా విడాకులు అవుతున్నాయి. సదరు మహిళలు పని చేసే అవకాశం ఉన్న భర్త నుంచి భరణం ఆశించడంపై విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగ్​పూర్(Nagpur)​కు చెందిన ఓ వ్యక్తి భార్యకు భరణం చెల్లించేందుకు దొంగగా మారాడు. ఆయనను పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు పంపారు. ఇటీవల ఓ మహిళ భరణం కింద నెలకు రూ.16 లక్షలు చెల్లించాలని కోరింది. దీంతో న్యాయమూర్తి(Judge) సైతం షాక్​ అయ్యారు. అంత మొత్తం ఒక నెలలో ఎలా ఖర్చు పెడతారని ఆమె ప్రశ్నించారు.

    Alimony | సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

    దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court)లో మంగళవారం భరణంపై వాదనల సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ తన ధనవంతుడైన భర్త నుంచి భరణం కోసం పిటిషన్​ వేసింది. సదరు మహిళ స్కిజోఫ్రెనిక్ (మానసిక సమస్యలు)తో బాధపడుతుందని చెప్పి ఆమె భర్త విడాకులు కోరాడు. భరణం కింద ఏం కావాలని మహిళను చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్​(Chief Justice B.R. Gavai) అడిగారు. దీనికి ఆమె ముంబైలో ఇల్లు, నిర్వహణ కోసం రూ.12 కావాలని కోరింది. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎంబీఏ చేసిన సదరు మహిళకు ఎందుకు పని చేయరు అని ప్రశ్నించారు.హైదరాబాద్​, బెంగళూరు వంటి నగరాల్లో ఎంబీఏ చేసిన వారికి డిమాండ్​ ఉందని పేర్కొన్నారు.

    Alimony | అతను ధనవంతుడు..

    వివాహం అయిన 18 నెలలకే మీరు ఇంత మొత్తం అడుగుతున్నారా అని సీజేఐ ప్రశ్నించారు. ఇప్పుడు మీకు BMW కారు కూడా కావాలా అన్నారు. 18 నెలల వివాహ బంధానికి నెలకు రూ.కోటి కోరుకుంటున్నారన్నారు. అతను ధనవంతుడని ఆమె పేర్కొనడం గమనార్హం. దీంతో సీజేఐ(CJI) స్పందిస్తూ.. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆమెకు సూచించారు. కానీ అతని తండ్రి ఆస్తులను కూడా క్లెయిమ్ చేయలేరని ఆమెకు తెలిపారు.

    Alimony | పెళ్లంటేనే భయపడుతున్న పురుషులు

    ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు చూస్తున్నా చాలా మంది యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్నారు. ఓ వైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తలను భార్యలు ప్రియుడితో కలిసి హతమారుస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. మరో వైపు భరణం పేరిట కేసులు వేస్తుండటంతో చాలా మంది యువకులు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయని.. ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...