HomeజాతీయంASEAN summit 2025 | ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ దూరం.. పుతిన్‌తో మీటింగ్ ర‌ద్దు...

ASEAN summit 2025 | ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ దూరం.. పుతిన్‌తో మీటింగ్ ర‌ద్దు చేసిన ట్రంప్

భారత ప్రధాని మోదీ ఈ నెల 26 నుంచి 28 వరకు మలేసియాలో జరగనున్న ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొనడం రద్దయింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సదస్సులో హాజరయ్యే అవకాశం లేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ASEAN summit 2025 | మలేసియా రాజధాని కౌలాలంపూర్​లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉండగా, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆయన ఈ సదస్సులో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ–అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ Trump మధ్య జరగనున్న భేటీ కూడా రద్దు అయ్యింది. ప్రధాని మోదీ సానుకూలంగా వర్చువల్‌లో సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోదీ స్థానంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. కాగా.. మోదీ ఆసియన్ సమ్మేళనానికి వెళ్లే ముందు కంబోడియా పర్యటన కూడా ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు అది కూడా వాయిదా పడింది.

ASEAN summit 2025 | ఆసియన్ కూటమి వివరాలు

ఈ సదస్సులో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్ తదితర 10 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఈ కూటమి రెండు సంవత్సరాల కొకసారి ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధిని చర్చించడానికి సమావేశమవుతుంది. భారత్ ఈ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ రంగాలలో పటిష్ట ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది. సదస్సులో సభ్య దేశాల మధ్య కలిగిన వివాదాలను, ముఖ్యంగా థాయ్‌లాండ్–కంబోడియా ఘర్షణలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపే ప్రయత్నం చేశారు. కంబోడియా ఆయనను నోబెల్ Nobel పీస్ బహుమతికి నామినేట్ చేయడంతో, ట్రంప్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారం.

ఈ పరిణామాలతో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యత, నాయకుల హాజరు విషయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. హంగేరీ రాజధాని బుదాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జ‌ర‌గాల్సిన‌ సమావేశాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం ఫలప్రదంగా ఉండదని ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన నాటో కార్యదర్శి మార్క్ రుట్‌తోతో వైట్‌హౌస్‌లో సమావేశమైన తర్వాత వెల్లడించారు. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం, ఈ చర్చలు అనుకున్న దిశలో వెళ్లడం లేదు, అందుకే సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, భవిష్యత్తులో పుతిన్‌తో (Putin) సంబంధిత చర్చలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.