అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | బోర్గాం(పి)లోని శ్రీ సాయి లక్ష్మీనగర్లోకి నిజాంసాగర్ కాలువ (Nizamsagar canal) ద్వారా సాగునీరు వచ్చి చేరుతుందని కాలనీవాసులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ఠాణాఖుర్దు నుంచి సాగునీరు (irrigation water) కాలనీలోని ఇళ్లముందుకు చేరుతోందన్నారు. దీంతో నడవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Nizamabad city | రాత్రి సమయాల్లో పరిస్థితి అధ్వానం..
రాత్రి సమయాల్లో వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా ఉండడం లేదని వివరించారు. ఈ నీటిని మార్గంలో పంపి తమ కాలనీవాసుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి సురేష్, జలంధర్, లింగం, శివ, శ్రీనివాస్, సాయి రామ్, సుధాకర్, గోపాల్ తదితరులు ఉన్నారు.

 
 


