అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Irrigation | సాగు నీటికే రంగానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి cm revanth reddy అన్నారు. హైదరాబాద్ జలసౌధ hyderabad jala soudha ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు.
Irrigation | ఆ ప్రాజెక్టులే నీరందిస్తున్నాయి..
వందల ఏళ్ల క్రితం నిజాం పాలన కట్టిన ప్రాజెక్టులు ఇంకా చెక్కు చెదరకుండా నీరందిస్తున్నాయని సీఎం తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ congress హయాంలో నిర్మించిన నాగర్జున సాగర్ nagarjuna sagar, శ్రీశైలం srisailam projects ప్రాజెక్టులతో మనకు నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరంతో kaleswharam అదనంగా పది వేల ఎకరాలకు కూడా నీరు అందించలేదన్నారు. నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్ ఎన్నో వరదలు, ఉపద్రవాలను తట్టుకుని నిలబడ్డాయని, కాళేశ్వరం మాత్రం కట్టిన మూడేళ్లలోనే కూలిందన్నారు.
Irrigation | ఆ నిధులు ఏమయ్యాయి
బీఆర్ఎస్ BRS హయాంలో ప్రాజెక్ట్‌ల కోసం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేశారని సీఎం పేర్కొన్నారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. మరీ ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల, నెట్టెంపాడు, సీతారామ, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Irrigation | పదేళ్లుగా నియామకాలు చేపట్టలేదు
రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ Irrigation Department లో పదేళ్లుగా నియామకాలు చేపట్టలేదని సీఎం విమర్శించారు. ఈ రోజు 423 మందికి నియామక పత్రాలు appointmetn letters ఇస్తున్నట్లు తెలిపారు. నీటి పారుదల శాఖలో 14 నెలల్లో 1,100 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. 2 వేల మంది లష్కర్‌లను నియమించామని వివరించారు.
Irrigation | త్వరలోనే గ్రూప్ – 1 నియామకాలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్–1 ఉద్యోగాలకు group -1 jobs నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. దీని వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. 15 ఏళ్లుగా గ్రూప్–1 నియామకాలు జరగలేదన్నారు. ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే తరుణంలో కొందరు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఆ సమస్య పరిష్కరించి గ్రూప్స్ నియామకాలు భర్తీ చేస్తామన్నారు.