అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కలెక్టర్లతో సమీక్ష నిర్వహించగా.. బుధవారం నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు రోజుల పాటు శాఖలో సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్ అలెర్ట్ (Red Alert) జారీ చేసిందన్నారు. ఇప్పటికే చెరువులు, ప్రాజెక్ట్లు నిండుకుండలా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు (Irrigation Department officials) స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అందరు తాము పనిచేసే హెడ్ క్వార్టర్లోనే ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Heavy Rains | చెరువులను పరిశీలించాలి
హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు జలశయాలు, చెరువులు నిండాయన్నారు. ప్రస్తుతం వరద అధికంగా వస్తే చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. లష్కర్ నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు విధుల్లో ఉండాలని ఆయన ఆదేశించారు. చెరువులు, కాలువలు, జలాశయాలను పరిశీలించాలని సూచించారు. గండ్లు పడే అవకాశం ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
నీటి పారుదల శాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ అధికారులతో (revenue and police officials) సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలలో జీవో నెంబర్ 45 ప్రకారం నిధులను వినియోగించాలన్నారు. కాల్వ కట్టలు తెగే సూచనలు గుర్తిస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.