ePaper
More
    HomeతెలంగాణCyberabad Police | రూ.5.30 కోట్లు కాజేసిన ఐఆర్​డీఏఐ ఉద్యోగి.. తర్వాత ఏం జరిగిందంటే?

    Cyberabad Police | రూ.5.30 కోట్లు కాజేసిన ఐఆర్​డీఏఐ ఉద్యోగి.. తర్వాత ఏం జరిగిందంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | ఓ ఉద్యోగి తాను పని చేస్తున్న కంపెనీనే మోసం చేశాడు. నకిలీ పత్రాలతో రూ.5.30 కోట్లు కాజేసి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించాడు.

    భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) అసిస్టెంట్ మేనేజర్‌​గా భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి పని చేస్తున్నాడు. ఫేక్​ ఇన్‌వాయిస్‌లు, ఆఫీస్‌ నోట్స్‌, కొటేషన్లు సృష్టించి ఆయన రూ.5.30 కోట్ల నిధులను కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లోకి మళ్లించాడు. ఈ మేరకు సైబరాబాద్​ పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్​ చేశారు. ఉన్నతాధికారులు ఆమోదించిన నోట్‌ ఫైళ్లను ఉపయోగించి ఆయన మోసానికి పాల్పడ్డాడు.

    Cyberabad Police | నకిలీ పత్రాలతో..

    హైదరాబాద్​ (Hyderabad)లోని షేక్​పేటకు చెందిన సూర్యనారాయణ శాస్త్రి ఐఆర్​డీఏఐ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్​గా పని చేస్తున్నాడు. నిందితుడు సంస్థ ప్రాసెస్ చేసిన నకిలీ చెల్లింపు ఫైళ్ల నుంచి నిధులను ఉన్నతాధికారుల ఆమోదం కోసం మళ్లించడానికి ముందస్తు ప్లాన్​ చేశాడు. నకిలీ ఇన్​వాయిస్​లు సృ ష్టించాడు. బ్యాంక్​ ఖాతాల స్థానంలో తన కుటుంబ సభ్యుల వివరాలు ఇచ్చాడు. ఆయా ఫైళ్లను ఉన్నతాధికారులు ఆమోదించిచడంతో ఆడిట్​ విభాగం ప్రాసెస్​ చేసింది. అయితే ఆ నిధులు విక్రేతలకు కాకుండా నిందితుడి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా రూ.5.30 కోట్లను సూర్యానారాయణ శాస్త్రి దుర్వినియోగం చేశాడు.

    Cyberabad Police | అప్పులపాలై..

    నిందితుడు ఇతరుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాడు. వాటిని తీర్చడానికి సంస్థ నిధులను దారి మళ్లించాలని ప్లాన్​ వేశాడు. చెల్లింపు ఫైళ్లను సిద్ధం చేయడానికి ఫేక్​ ఇన్‌వాయిస్‌లు, ఆఫీస్ నోట్‌లు, కొటేషన్‌లను సృష్టించాడు. ఈ మేరకు సంస్థ ఫిర్యాదు చేయడంతో సూర్యనారాయణ శాస్త్రిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

    Latest articles

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    Leopard dies | జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత దుర్మరణం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Leopard dies : జాతీయ రహదారిపై వన్యప్రాణి wildlife animal బలైంది. నిజామాబాద్​ Nizamabad జిల్లాలో...

    More like this