అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bharat Gaurav Yatra | రైల్వే శాఖ ప్రయాణికుల అవసరాల మేరకు చర్యలు చేపడుతోంది. రద్దీ ఉన్న మార్గాల్లో రైళ్లను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. వేగంగా వెళ్లడానికి ఇప్పటికే వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) నడుపుతోంది. అంతేగాకుండా యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. భారత్ గౌరవ్ యాత్ర పేరిట పలు క్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. ఐఆర్సీటీసీ (IRCTC) ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీతో రైళ్లను నడుపుతోంది.
భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) నుంచి ఆగస్టు 16న బయలుదేరుతుంది. ఈ రైలు ద్వారా పంచ (5) జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. 8 రాత్రులు, తొమ్మిది రోజులు ఈ యాత్ర కొనసాగుతోంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్ క్షేత్రాలను దర్వించుకోచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముథ్కేడ్, నాందేడ్, పూర్ణా స్టేషన్లలో ఆగుతుంది.
Bharat Gaurav Yatra | టికెట్ ధరలు
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా స్లీపర్ క్లాస్ టికెట్ రూ.14,700గా నిర్ణయించారు. థర్డ్ ఏసీ రూ.22,900, సెకండ్ ఏసీ రూ.29,900 టికెట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రోజుకు మూడు పూట భోజనం, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. వివరాల కోసం వెబ్‌సైట్ www.irctctourism.com, 97013 60701, 92810 30740 ఫోన్ నంబర్లను సంప్రదించాలని రైల్వే అధికారులు సూచించారు.