ePaper
More
    HomeజాతీయంSwarail | ఐఆర్‌సీటీసీ మ‌రో బుకింగ్ యాప్‌.. అందుబాటులోకి 'స్వారైల్'

    Swarail | ఐఆర్‌సీటీసీ మ‌రో బుకింగ్ యాప్‌.. అందుబాటులోకి ‘స్వారైల్’

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swarail | ఐఆర్‌సీటీసీ(IRCTC) ప్ర‌యాణికుల కోసం మ‌రో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్వారైల్’ (Swarail app) అనే కొత్త టికెట్ బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది.

    రైలు ప్రయాణ ప్రణాళిక, ప్రత్యక్ష రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డరింగ్‌తో అనేక సేవ‌ల‌ను ఆ యాప్ ద్వారా పొంద‌వ‌చ్చు. ఈ యాప్‌ను భారతదేశంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసింది. SwaRail యాప్.. భారతీయ రైల్వే సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం ముందస్తు యాక్సెస్‌లో ఉన్నప్పటికీ, వినియోగదారులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇప్పటికే ఉన్న IRCTC యాప్‌ను ఉపయోగించవచ్చు.

    Swarail | టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

    ముందుగా SwaRail యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ IRCTC యూజ‌ర్ నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ కావాలి. హోమ్ స్క్రీన్‌లో ‘జర్నీ ప్లానర్’ పై క్లిక్ చేసి ‘రిజర్వ్డ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత మీరు వెళ్లే గ‌మ్య స్థానం, తేదీ ఎంట‌ర్ చేయండి. మీ ప్రయాణ తేదీ, తరగతి, కోటాను నమోదు చేసి, మీరు వెళ్లాల్సిన స్టేషన్ కోసం సెర్చ్ చేయండి. అందుబాటులో ఉన్న రైళ్లు స్క్రీన్‌పై క‌నిపిస్తాయి.

    మీకు నచ్చినదాన్ని సెల‌క్ట్ చేసుకుని, మీరు ప్రయాణించాలనుకుంటున్న కోచ్ తరగతిని ఎంచుకోండి. బోర్డింగ్ స్టేషన్‌తో పాటు ఎంత మంది వెళ్తున్నారో వారి వివరాలను నమోదు చేయాలి. ఫైన‌ల్గా ‘జర్నీ వివరాలను సమీక్షించండి’పై క్లిక్ చేయాలి. తదుపరి స్క్రీన్‌లో, రైలు వివరాలు, ప్రయాణ సమయం, చార్జీలను తనిఖీ చేయాలి. ఆ త‌ర్వాత కాావాల్సిన సమాచారన్ని టైప్ చేసి క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ వెంట‌నే మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్క‌డ UPI, కార్డ్, నెట్-బ్యాంకింగ్ లేదా R-వాలెట్ ద్వారా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెంట‌నే మీకు బుకింగ్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌స్తుంది.

    Latest articles

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    More like this