అక్షరటుడే, వెబ్‌డెస్క్: IRCTC International Tours : దేశీయ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల టూర్ ప్యాకేజీలను ఐఆర్సీటీసీ (IRCTC) అందిస్తుంటుంది.
దాని పరిధిని తాజాగా విస్తరించింది. అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై దృష్టి సారించింది.
సెప్టెంబర్‌లో నేపాల్, నవంబర్‌లో థాయ్‌లాండ్ పర్యటనకు శ్రీకారం చుట్టింది ఐఆర్సీటీసీ. అదికూడా హైదరాబాద్ నుంచి అందిస్తోంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..
IRCTC International Tours : నేపాల్ టూర్..
సెప్టెంబరు 12వ తేదీన నేపాల్ పర్యటన (Nepal tour) మొదలవుతుంది. ఇది ఆరు రాత్రులు / ఏడు రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది. పోఖరా, లుంబిని, కాఠ్మాండూ, జనక్పుర్ ప్రాంతాలను ఈ పర్యటనలో చూడొచ్చు.
టూర్ బృందంలో 30 మంది మాత్రమే వెళ్లొచ్చు. ఈ టికెట్ ధర ఒక్కరికి రూ.43,330 నుంచి మొదలవుతుంది.
Day 1: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి ఉదయం 11.10కి విమానం బయలుదేరుతుంది. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌లో ఆగుతుంది.
గోరఖ్‌పూర్ (Gorakhpur) నుంచి నేపాల్‌లోని లుంబినికి ఐఆర్సీటీసీ సిబ్బంది వాహనంలో తీసుకెళ్తారు. పర్యాటకులు రాత్రి బస అక్కడే చేయాల్సి ఉంటుంది.
Day 2: మరుసటి రోజు ఉదయం లుంబిని (Lumbini) నుంచి పోఖరా(Pokhara)కు ఐఆర్సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. అక్కడ పగోడా (pagoda), మాయ దేవి ఆలయం (Maya Devi Temple) ప్రత్యేకమైనది.
వీటిని పర్యాటకులు సందర్శించొచ్చు. ఇక ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
Day 3: ఎర్లీ మార్నింగ్ సారంగ్ కోట్ (Sarangkot) సన్రైజ్ వ్యూ పాయింట్ (sunrise view point) ఆస్వాదన ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
దేవీ ఫాల్స్ (Devi Falls), బింద్యాబాసిని మందిర్ (Bindyabasini Mandir), గుప్తేశ్వర మహదేవ్ గుహలు (Gupteshwar Mahadev caves) చూడ చక్కనైన ప్రదేశాలు. తదుపరి సేవా సరస్సు(Sewa Lake)లో బోటింగ్ ఆ మజానే వేరు. ఇక ఆరోజు రాత్రి పోఖరాలో నిద్ర.
Day 4: పర్యాటకులను ఉదయం కాఠ్మాండూ (Kathmandu) కి ఐఆర్సిటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. మార్గమధ్యలో మనోఖన్మ ఆలయం (Manokhanma Temple) సందర్శన ఉంటుంది.
సాయంత్రం కాట్మాండూ మార్కెట్లో షాపింగ్‌తో ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
Day 5: ఉదయం కాట్మాండూలోని పశుపతినాథ్ ఆలయం (Pashupatinath Temple), రాయల్ ప్యాలెస్ (Royal Palace), దర్బార్ స్క్వేర్ (Durbar Square), స్వయంభునాథ్ ఆలయం (Swayambhunath Temple) సందర్శన. రాత్రి అక్కడే బస.
Day 6: జనకపుర్ (Janakapur) కి వెళ్లడం. అక్కడ హోటల్లో ఫ్రెష్అప్ అయ్యాక.. జానకి ఆలయ (Janaki Temple) సందర్శన. రాత్రి అక్కడే బస.
Day 7: ఉదయం జనకపుర్ నుంచి దర్భంగా విమానాశ్రయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడం.
IRCTC International Tours : థాయ్‌లాండ్ టూర్ ఇలా..
ఐదు రోజులు / నాలుగు రాత్రుల పాటు థాయ్‌లాండ్ (Thailand) పర్యటన ఉంటుంది. నవంబరు 6న ఈ పర్యటన ప్రారంభం అవుతుంది.
ఒక బృందంలో 14 మందికే అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకాక్, పట్టాయ ఈ టూర్లో ముఖ్యమై. ప్రదేశాలు. ఈ యాత్ర టికెట్ ధర రూ.65,600 నుంచి మొదలవుతుంది.
Day 1: నవంబరు 5న రాత్రి 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. నవంబరు 6వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది.
అదేరోజు ఉదయం 6.30 గంటలకు బ్యాంకాక్ (Bangkok) చేరుకుంటారు. అక్కడి నుంచి పట్టాయ (Pattaya) కు వెళ్లాలి. అక్కడి హోటల్లో చెక్ఇన్ ఉంటుంది.
తదుపరి టైగర్ పార్క్ వెళ్తారు. సాయంత్రం అల్కాజర్ షో చూపిస్తారు. అక్కడే ఉన్న ఇండియన్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి భోజనం చేయిస్తారు. తర్వాత ఆ రాత్రికి పట్టాయలోనే నిద్ర పోవాల్సి ఉంటుంది.
Day 2: ఉదయం స్పీడ్ బోట్లో కోరల్ ఐలాండ్‌కు వెళ్తారు. తదుపరి జెమ్స్ గ్యాలరీ చూపిస్తారు. తర్వాత మళ్లీ హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.
Day 3: ఇక పట్టయకు వీడ్కోలు పలకడం.. బ్యాంకాక్‌కు ప్రయాణం సాగించడం ఉంటుంది. ఇక బ్యాంకాక్‌లో చక్కని ప్రదేశాలు చుట్టేయొచ్చు.
గోల్డెన్ బుద్ధ (Golden Buddha), మార్బుల్ బుద్ధ (Marble Buddha), ఇతర సందర్శక ప్రాంతాలు తిలకించవచ్చు. రాత్రి అక్కడే హోటల్లో బస.
Day 4: మెరైన్ పార్క్ (Marine Park), సఫారీ వరల్డ్ (Safari World) చూపిస్తారు. మళ్లీ హోటల్లో నిద్ర.
Day 5: ఉదయం హోటల్ ఖాళీ చేయిస్తారు. తర్వాత బ్యాంకాక్ ఓషియన్ వరల్డ్ (Bangkok Ocean World) కు తీసుకెళ్తారు. తర్వాత మధ్యాహ్నం భోజనం ఉంటుంది.
భోజనం తర్వాత షాపింగ్. షాపింగ్ అయ్యాక విమానాశ్రయానికి ప్రయాణం. ఇక అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేరుగా హైదరాబాద్(Hyderabad)కు వచ్చేస్తారు.
ఇవి గుర్తుంచుకోవాలి..
ఈ అంతర్జాతీయ పర్యటనలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన టికెట్ రుసుములు, టిప్స్, టూర్ గైడ్లు, రూమ్ సర్వీసు ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు ఐఆర్సీటీసీ (IRCTC) ప్యాకేజీలో ఉండవు.