అక్షరటుడే, వెబ్‌డెస్క్: IRCTC | ఐఆర్‌సీటీసీ (IRCTC) ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్‌లు అందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా “అరుణాచల మోక్ష యాత్ర”(Arunachala Moksha Yatra) టూర్ ప్యాకేజీని ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అరుణాచలానికి భక్తులు వెళ్తూ ఉంటారు. వీరికోసం ఐఆర్‌సీటీసీ కాచిగూడ(Kachiguda) నుంచి ఈ యాత్రలో పుదుచ్చేరిలోని చారిత్రక ప్రాంతాలు, బీచ్ లో గడపడంతో పాటుగా అరుణాచలం, కాంచీపురం సందర్శించేలా వీలు కల్పించింది. అరుణాచల మోక్ష యాత్ర ద్వారా అరుణాచలం, పుదుచ్చేరి, కాంచీపురం సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
IRCTC | స్పెషల్ ప్యాకేజ్..
5 రోజులు (4 రాత్రులు) కొనసాగే ఈ యాత్రను హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి ప్రతి గురువారం నిర్వహిస్తోంది. ప్యాకేజ్ ధరలు చూస్తే 3AC : డబుల్ షేరింగ్ రూ.20,060, ట్రిపుల్ షేరింగ్ రూ.15,160, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ రూ.11,750, వితవుట్ బెడ్ రూ.9,950 టిక్కెట్ ధర నిర్ణయించింది. అదే విధంగా SL(స్లీపర్) : డబుల్ షేరింగ్ రూ.17,910, ట్రిపుల్ షేరింగ్ రూ.13,460, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ రూ.9,590, వితవుట్ బెడ్ రూ.7,800 టిక్కెట్ ధర నిర్ణయించింది. యాత్రలో (arunachalam moksha yatra) భాగంగా తొలిరోజు కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station) నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు (17653) బయల్దేరుతుంది.
రాత్రి మొత్తం ప్రయాణం చేసి, రెండో రోజు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుని అక్కడ హోటల్ చెకిన్ అయిన తర్వాత అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్(Paradise Beach) చూసి రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం చేసిన వెంటనే అక్కడి నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించి తిరువన్నామలై (అరుణాచలం) చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి అక్కడ బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేశాక అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కాంచీపురం(Kanchipuram) ప్రయాణం చేస్తారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వరాలయం దర్శించుకుని అక్కడి నుంచి 40 కిలో మీటర్ల దూరంలోని చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణించి 5వ రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ kachiguda స్టేషన్ చేరుకుంటారు. ఇంకెందుకు మరి ఆలస్యం ఈ అద్భుత ప్రయాణాన్ని అస్సలు మిస్ కాకండి.