ePaper
More
    Homeఅంతర్జాతీయంStrait Of Hormuz | ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత

    Strait Of Hormuz | ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: strait of hormuz | ఇరాన్​– ఇజ్రాయెల్​ యుద్ధం (Iran-Israel War)తో పశ్చిమాసియాలో తీవ్ర అశాంతి నెలకొంది. ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులతో యుద్ధం ప్రారంభం కాగా.. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే శనివారం రాత్రి ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణు శుద్ధి కేంద్రం లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అమెరికా దాడిపై ఆగ్రహంగా ఉన్న ఇరాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్​ జలసంధి (strait of hormuz ) మూసివేయాలని యోచిస్తోంది.

    భారత్(Bharat)​, చైనా (China) సహా ఆసియా దేశాలకు నిత్యం హర్మూజ్​ జల సంధి ద్వారానే చమురు సరఫరా అవుతుంది. చమురు రవాణాలో ఇది ఎంతో కీలకం. అటువంటి జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ జలసంధిని మూసివేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు హర్మూజ్ జలసంధి మీదుగానే సరఫరా అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    strait of hormuz | ఎంత కీలకం అంటే..

    ఇరాన్‌, ఒమాన్‌ల మధ్య ఉండే హర్మూజ్​ జలసంధి పర్షియన్‌ జలసంధిని ఒమాన్‌ జలసంధితో, అరేబియా సముద్రంతో కలుపుతుంది. యూరప్​ దేశాల సరుకు రవాణాకు సుయెజ్​ కెనాల్​ ఎంత ముఖ్యమో..హర్మూజ్​ జల సంధి కూడా అంతేకీలకం. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్‌ కెనాల్‌ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు హర్మూజ్​ జల సంధి ద్వారా జరుగుతుంది. ఈ మార్గం ద్వారా నిత్యం భారత్​కు 15 లక్షల బ్యారెళ్ల ముడి చమురు వస్తుంది.

    భారత్​, చైనాకు కీలకమైన ఈ జలసంధిని మూసి వేస్తే ఇంధన సంక్షోభం తలెత్తి రేట్లు పెరిగే అవకాశం ఉంది. మూసివేత నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్​ ఈ జలసంధి మూసివేస్తే.. దానిని మరింత పెంచాలని చూస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి యోచిస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...