HomeUncategorizedIsrael Attack | ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ దుర్మరణం

Israel Attack | ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel Attack | ఇరాన్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ (Iranian capital Tehran)ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడితో టెహ్రాన్ మొత్తం కుదుపునకు గురైంది. ఇజ్రాయెల్ ఈ దాడిలో ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసింది. టెహ్రాన్​లో వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్​ విరుచుపడింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ సైతం (Iranian military chief) మృతి చెందారు. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ (Iran’s paramilitary Revolutionary Guard chief) మేజర్ హోస్సేన్ సలామీ (Major Hossein Salami), ఇద్దరు ఉన్నతాధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇజ్రాయెల్​ బాంబులు, క్షిపణుల దాడితో ఇరాన్​లో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై ఆ దేశం అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు.