HomeUncategorizedIran-Israel Ceasefire | కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన

Iran-Israel Ceasefire | కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran-Israel Ceasefire | ఇరాన్​ – ఇజ్రాయెల్​ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల యుద్ధంతో రగిలిపోతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గనున్నాయి. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(Donald Trump)​ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఆయన వ్యాఖ్యాలను ఖండించిన ఇరాన్​ తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది.

ఇజ్రాయెల్​పై దాడి తర్వాత సీజ్ ఫైర్(Ceasefire ) అమలులోకి వచ్చినట్లు ప్రకటించడం గమనార్హం. కాల్పుల విరమణకు చివరి నిమిషం వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని ఇరాన్(Iran)​ తెలిపింది. 12 రోజులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరగ్గా.. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి.

Iran-Israel Ceasefire | స్పందించని ఇజ్రాయెల్​

సీజ్‌ ఫైర్‌ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ట్రంప్​ పోస్ట్​ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఇరాన్‌, ఆపై ఇజ్రాయెల్‌(Israel) కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇజ్రాయెల్​ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు మాత్రం జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ యుద్ధం ముగిస్తే 12 రోజులుగా రగిలిపోతున్న పశ్చిమాసియాలో శాంతి నెలకొననుంది.

Must Read
Related News