ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael – Iran | ఇరాన్ ఒప్పందానికి రాకుంటే వినాశనమే.. ఇజ్రాయెల్ దాడిని అద్భుతమని వర్ణించిన...

    Israel – Iran | ఇరాన్ ఒప్పందానికి రాకుంటే వినాశనమే.. ఇజ్రాయెల్ దాడిని అద్భుతమని వర్ణించిన ట్రంప్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Israel – Iran | ఇరాన్ తక్షణమే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) హెచ్చరించారు. ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడిని అద్భుతమని ఆయన అభివర్ణించారు. ఇరాన్ అణు ప్రణాళికలను అడ్దుకునేందుకు ఇజ్రాయెల్ (Israel) శుక్రవారం భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇరాన్ (Iran) అణు స్థావరాలతో పాటు కీలకమైన శాస్త్రవేత్తలు, ముఖ్యమైన మిలిటరీ అధికారులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడి “అద్భుతమైనది” అని వ్యాఖ్యానించారు. అంతే కాదు, ఇంకా చాలా జరగాల్సి ఉందని హెచ్చరించారు.

    Israel – Iran | నరమేధం తప్పదు..

    ఇరాన్ తక్షణమే అమెరికాతో (America) అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్​కు చాలాసార్లు అవకాశమిచ్చానని, అయినా వారు తమ మాట వినలేదని అసహనం వ్యక్తం చేశారు. మా మాట వినకతపోతే తగిన మూల్యం చెల్లిస్తారని స్పష్టం చేశారు. “మేము వారికి (ఇరాన్) అవకాశం ఇచ్చాం. కానీ వారు దానిని సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు చాలా తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఇంకా చాలా రాబోతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మరిన్ని దారుణమైన దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) ప్రణాళికలు రూపొందించిందని” ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా (United States) దాడిలో ఏ విధంగానైనా పాల్గొన్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదని చెప్పారు.

    Israel – Iran | దాడులను సమర్థించిన ట్రంప్..

    ఇజ్రాయెల్ (Isreal) శుక్రవారం ఉదయం ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (‘Operation Rising Lion’) కింద ఇరాన్​లోని దాదాపు 100 లక్ష్యాలపై దాడులు చేసింది. ఆ దేశ అణు సౌకర్యాలు, సైనిక కమాండ్ కేంద్రాలపై (military command centers) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఇరాన్ మిలిటరీ అగ్ర నాయకులు, శాస్త్రవేత్తలు చాలా మంది మరణించారు. తమ దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ అణు కార్యక్రమం (Iran nuclear program) దాదాపు ‘తిరిగి రాని స్థితికి’ చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రంగా ఖండించారు. దీన్ని యుద్ధ ప్రకటనగా అభివర్ణించిన ఆయన.. ఇజ్రాయెల్ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు, ఇజ్రాయిల్ దాడులను ట్రంప్ సమర్థించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి చర్చలలో అమెరికా డిమాండ్లను ప్రతిఘటించడం ద్వారా తానే స్వయంగా దాడిని తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రణాళిక రూపొందించిన దాడులు మరింత క్రూరంగా ఉంటాయని హెచ్చరించారు. అది జరుగకుండా ఉండాలంటేతమతో ఒప్పందం కుదుర్చుకోవాలని సలహా ఇచ్చారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...