HomeUncategorizedUS - IRAN WAR | అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్​.. మిసైల్స్ తో...

US – IRAN WAR | అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్​.. మిసైల్స్ తో ప్రతీకార దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US – IRAN WAR : పశ్చియాసియా మధ్యప్రాచ్యం(Middle East)లో తీవ్ర పరిణామాలకు దారితీసేలా ఇరాన్‌ కీలక అడుగు వేసింది. అమెరికా తమ అణు కేంద్రాలపై చేసిన బాంబుల దాడికి ప్రతీకారంగా.. సోమవారం ఇరాన్‌ సాహాసోపేత అడుగులు వేసింది. ఖతార్‌(Qatar)లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇరాక్‌(Iraq)లోని మిలిటరీ బేస్‌లపై ఇరాన్​ మిసైల్స్ తో విరుచుపడింది.

US – IRAN WAR : ఆరు మిసైళ్లు ప్రయోగించిన ఇరాన్‌

ఖతార్‌లోని అమెరికా సైనికులపై ఇరాన్‌ ఆరు మిసైళ్లను ప్రయోగించిందని.. ఇజ్రాయెల్‌ అధికారి తరఫున Axios నివేదించింది. కాగా, వాటిని విజయవంతంగా ఇంటర్‌సెప్ట్ చేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్‌ ప్రభుత్వం ప్రకటించింది.

US – IRAN WAR : ప్రతీకార దాడి..

ఇరాన్‌పై మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడికి దిగిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. ఈ దాడితో Israel వర్సెస్ ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంది. B-2 స్టెల్త్ బాంబర్ల ద్వారా ఒక్కోటి 30,000 పౌండ్ల బరువున్న 14 బంకర్ బస్టర్ బాంబులను ప్రధాన అణు కేంద్రమైన ఎన్‌రిచ్‌మెంట్ సైట్లపై విసిరింది.

US – IRAN WAR : దోహాలో పేలుళ్ల శబ్దం

ఇరాన్​ దాడికి సంబంధించి దోహా నగరంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని రాయిటర్స్‌కి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఖతార్‌పై ఇరాన్‌ నుంచి ఇప్పటి వరకు ఎదురైన అతిపెద్ద వైమానిక దాడిగా దీనిని వర్ణిస్తున్నారు.

US – IRAN WAR : మిస్సైల్​ లాంచ్​​కు సిద్ధం!

మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడికి ఇరాన్‌ తన మిసైల్ లాంచర్‌లను సిద్ధం చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్.. US అధికారులను ఉటంకిస్తూ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని అమెరికా బేస్‌లపై ముప్పు ఉందని పెంటగాన్ గుర్తించిందని కూడా వెల్లడించింది.

US – IRAN WAR : గల్ఫ్ వార్​ తర్వాత..

1990లో గల్ఫ్ వార్ తర్వాత ఖతార్‌లో అమెరికా తన స్ట్రాటజిక్ ఉనికిని ఏర్పర్చుకుంది. ఇరాన్, ఇరాక్‌ల నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి యూఎస్​ చేపట్టిన వ్యూహాత్మక చర్యల్లో ఖతార్‌ కీలక భాగస్వామిగా ఉంది.

US – IRAN WAR : అల్-ఉదెయిద్ ఎయిర్ బేస్

ఖతార్​లోని అల్-ఉదెయిద్ ఎయిర్ బేస్‌ అమెరికా దాని మిత్ర దేశాల మిలిటరీ బేస్‌గా కొనసాగుతోంది. ఇది దోహా నగరానికి దక్షిణ పశ్చిమాన ఉంది. మిడిల్ ఈస్ట్‌లో ఇది అమెరికా అతిపెద్ద మిలిటరీ బేస్‌గానే కాకుండా, యూఎస్​ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రంగా ఉండటం గమనార్హం.

1996లో అల్-ఉదెయిద్ ఎయిర్ బేస్‌ స్థాపించబడింది. 9/11 తర్వాత దీనిని భారీగా విస్తరించారు. ఇది US Central Command (CENTCOM) ముందస్తు ప్రధాన కేంద్రంగా ఉంది. పశ్చిమ, మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు ఇది నియంత్రణ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ బేస్‌లో అత్యధికంగా 10,000 మందికి పైగా యూఎస్​ సిబ్బంది ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, ISISపై యుద్ధాలలో బేస్​ కీలక పాత్ర పోషించింది. కాగా, తాజాగా దోహాపై ఇరాన్​ దాడి నేపథ్యంలో ఈ బేస్​ రక్షణపై ఆందోళన నెలకొంది.

Must Read
Related News