అక్షరటుడే, వెబ్‌డెస్క్: Israel Prime Minister | ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)ను హతమార్చేందుకు ఇరాన్ రెండుసార్లు ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు . 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావించిన నెతన్యాహు.. ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్(Iran) అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ రెండు సార్లు ట్రంప్‌ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని.. ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదన్నారు. తమ అణు ఆశయాలకు ట్రంప్‌ను ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli Prime Minister Netanyahu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ – టెల్ అవీవ్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Israel Prime Minister | అణు కార్యక్రమానికి ముప్పుగా భావించి..
ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం(Islamic government) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తమ అణు కార్యక్రమానికి ముప్పుగా గుర్తించిందని, ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు. ముఖ్యంగా, గత సంవత్సరం ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనపై రెండుసార్లు జరిగిన హత్యాయత్నాలను ఆయన గుర్తు చేశారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ఇరాన్ కుట్ర పన్నిందని మీకు ఏదైనా సమాచారం ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు. “ప్రాక్సీల ద్వారా, వారి ఇంటెల్ ద్వారా ఆయనను చంపాలనుకుంటున్నారు” అని అన్నారు. “వారు ఆయనను చంపాలనుకుంటున్నారు. ఆయన వారికి నంబర్ వన్ శత్రువు” అని నెతన్యాహు పేర్కొన్నారు.
Israel Prime Minister | ట్రంప్‌పై ప్రశంసలు..
నెతన్యాహు తనను తాను ట్రంప్ ‘జూనియర్ భాగస్వామి’ అని అభివర్ణించుకున్నారు. “ఆయన (ట్రంప్) నిర్ణయాత్మక నాయకుడు. ఇతరులు వారితో బేరసారాలు చేయడానికి ప్రయత్నించిన మార్గాన్ని ఆయన ఎప్పుడూ అనుసరించలేదు” అని ఆయన అన్నారు.. “అతను(ట్రంప్) ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు. అతను చాలా బలవంతుడు, కాబట్టి వారికి నంబర్ వన్ శత్రువు అయ్యాడని” నెతన్యాహు తెలిపారు. తన ఇంటి బెడ్ రూమ్ కిటికీలోకి క్షిపణిని ప్రయోగించిన తర్వాత తాను కూడా లక్ష్యంగా ఉన్నానని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ ద్వంద్వ అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటుందని నెతన్యాహు తెలిపారు. “ఒకటి, మనల్ని నాశనం చేయాలనే నిర్దిష్ట, ప్రకటిత ఉద్దేశ్యంతో అణు బాంబులను తయారు చేయడానికి ఇరాన్ యురేనియం(Iran uranium)ను ఆయుధాలుగా చేసుకోవడానికి తొందరపడడం. రెండవది, వారి బాలిస్టిక్ క్షిపణి ఆయుధాగారాన్ని సంవత్సరానికి 3,600 ఆయుధాల సామర్థ్యానికి పెంచాలనే తొందర.. మూడు సంవత్సరాలలో 10,000 బాలిస్టిక్ క్షిపణులు, ఒక్కొక్కటి ఒక టన్ను బరువు, మాక్ 6 వేగంతో తయారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ అస్తిత్వం కోసం మేం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని” వివరించారు.