ePaper
More
    HomeజాతీయంTrue Promise 3 | ఇజ్రాయెల్​పై ప్రతిదాడులకు దిగిన ఇరాన్

    True Promise 3 | ఇజ్రాయెల్​పై ప్రతిదాడులకు దిగిన ఇరాన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :True Promise 3 | ఇరాన్​పై ఇజ్రాయెల్ (Israel) దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గురువారం రాత్రి ఇరాన్​లోని అణుస్థావరాలు, సైనిక నేతలు, అణు శాస్త్రవేత్తలే(Nuclear scientists) లక్ష్యంగా దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్​ ప్రతి దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌(Ballistic missiles)తో దాడులు చేసింది.

    True Promise 3 | ట్రూ ప్రామిస్​ 3 పేరిట

    ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా ఆ దేశానికి భారీ నష్టం కలిగిస్తామంటూ ఇరాన్ సుప్రీం నేత (Iran Supreme Leader) ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ‘ట్రూప్రామిస్ 3’ పేరుతో ఇరాన్ ఆపరేషన్ చేపట్టింది. క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్​పై దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్​ వంద వరకు మిసైళ్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్​ అధికారులు తెలిపారు. వాటిలో చాలావరకు మధ్యలోనే కూల్చివేశామని చెప్పారు.

    True Promise 3 | ఇరాన్​ సుప్రీం లీడర్​ లక్ష్యంగా..

    ఇరుదేశాలు శుక్రవారం మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్​ డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించడంతో టెల్​అవీవ్​ సైతం దీటుగానే బదులిచ్చింది. ఈ క్రమంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) లక్ష్యంగా ఇజ్రాయెల్​ దాడులు చేయడం గమనార్హం. ఆయన లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ (Operation Rising Lion) పేరుతో గురువారం రాత్రి ఇజ్రాయెల్​ చేపట్టిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. మరో 329 మంది గాయపడ్డారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...