ePaper
More
    Homeఅంతర్జాతీయంIran-Israel Ceasefire | ఇరాన్​ – ఇజ్రాయెల్​ యుద్ధం ముగిసింది.. ట్రంప్​ ప్రకటన.. కానీ..!

    Iran-Israel Ceasefire | ఇరాన్​ – ఇజ్రాయెల్​ యుద్ధం ముగిసింది.. ట్రంప్​ ప్రకటన.. కానీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran-Israel Ceasefire | ఇరాన్​ – ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(US President Donald Trump)​ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తుందని వెల్లడించారు.

    ఇరాన్​ అణుశక్తి గల దేశంగా ఎదిగితే తమకు ముప్పు అని భావించిన ఇజ్రాయెల్​ ఆపరేషన్​ రైజింగ్​ లయన్​(Operation Rising Lion) పేరిట దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్​లోని అణు స్థావరాలు, శాస్త్రవేత్తలు, ఆర్మీ ఉన్నతాధికారులు లక్ష్యంగా టెల్​అవీవ్(Tel Aviv)​ దాడులకు పాల్పడింది. అనంతరం ఇరాన్​ కూడా ఇజ్రాయెల్​పై క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం మొదలైంది. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్న క్రమంలో అమెరికా(America) సైతం అందులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణుస్థావరాలపై అమెరికా క్లస్టర్​ బాంబులు(Cluster bombs) ప్రయోగించింది. అమెరికా తీరుతో ఆగ్రహంగా ఉన్న ఇరాన్​ సోమవారం రాత్రి ఖతార్​లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్​లోని సైనిక స్థావరాలపై సైతం దాడులు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ట్రంప్​ ప్రకటించడం గమనార్హం.

    ప్రస్తుతం కొనసాగుతున్న మిషన్లను పూర్తి చేసుకునేందుకు ఇరాన్, ఇజ్రాయెల్‌కు కొంత సమయం లభించనుందని, అనంతరం ఈ కాల్పుల విరమణ దశలవారీగా అమల్లోకి వస్తుందని ట్రంప్ వివరించారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు పలకడానికి ముందుకు వచ్చిన రెండు దేశాలను ఆయన అభినందిస్తూ ఆయన సోషల్​ మీడియాలో పోస్ట్​ పెట్టారు.

    Iran-Israel Ceasefire | కొట్టి పారేసిన ఇరాన్​

    కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ చేసిన ప్రకటనను ఇరాన్​ కొట్టిపారేసింది. ప్రస్తుతం అలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. ట్రంప్​ ప్రకటనపై ఇజ్రాయెల్(Israel)​ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం విషయంలో అనిశ్చితి నెలకొంది. కాగా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడానికి ముందు కూడా ఇరాన్, ఇజ్రాయెల్‌లు మళ్లీ దాడులపై పరస్పరం బెదిరింపులు చేసుకోవడం గమనార్హం. మరోవైపు ఇరాక్​, ఖతార్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్​ దాడులు చేయడంతో ఆయా దేశాల గగనతలాలను మూసివేశారు. అయితే ఇరాన్​ జరిపిన దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా తెలిపింది.

    More like this

    Nepal Government | వెన‌క్కి త‌గ్గిన నేపాల్ ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియాపై నిషేధం ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Government | నేపాల్ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. సోష‌ల్ మీడియా సైట్‌లపై విధించిన...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...

    Asia Cup | క్రికెట్ పండుగ మళ్లీ మొదలైంది.. నేటి నుంచి ఆసియా కప్.. లైవ్ డీటెయిల్స్, ఫుల్ షెడ్యూల్ ఇదిగో!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా...